స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.. 94 కోట్ల జరిమానాతో ఉక్కిరిబిక్కిరి!
భారీ ఆర్థిక నేరానికి పాల్పడిన స్టార్ హీరోయిన్ చిక్కుల్లో పడింది. చైనాలో టాప్ స్టార్ గా కొనసాగుతున్న ఫ్యాన్ బింగ్ బింగ్ ఘరానా మోసంతో ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించింది. చివరకు తానే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. హీరోయిన్ బింగ్ బింగ్ భారీ మొత్తంలో పన్ను ఎగవేయడానికి ప్రయతించింది. బింగ్ బింగ్ మోసాన్ని చైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు పసిగట్టడంతో మోసం బట్టబయలైంది.

క్రేజీ చిత్రాలు
ఎక్స్ మాన్, ఇరన్ మాన్, యాష్ ఈజ్ ప్యూరెస్ట్ వైట్ వంటి క్రేజీ చిత్రాలలో బింగ్ బింగ్ నటించింది. పన్ను ఎగవేసిన కేసులో ఇప్పటికే ఆమె మేనేజర్ ని కూడా అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ జరిమానా
ఆమె పన్ను ఎగవేత కేసు పరిగణలోకి తీసుకున్న అధికారులు భారీ మొత్తంలో జరిమానా విధించారు. 129 మిలియన్ డాలర్లు(దాదాపు 94 కోట్లు) ఆమె జరిమానా రూపంలో చెల్లించాలని ఆదేశించారు. లేకుంటే క్రిమినల్ కేసుగా మారి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కుంభకోణం ఇలా
పలు చిత్రాలలో ఆమె అందుకున్న పారితోషకాన్ని పన్ను విధించకుండా కాంట్రాక్టులు విభజించి కుంభకోణానికి పాల్పడిందని అధికారులు ఆరోపిస్తున్నారు. కేసు నేపథ్యంలో ఆమె భయపడి అమెరికా పారిపోయిందనే ఉహాగానాలు సైతం జోరందుకున్నాయి.

అత్యధిక ఆదాయం
గత ఏడాది అత్యధిక ఆదాయం ఆర్జించిన చైనా ప్రముఖుల ఫోర్బ్స్ జాబితాలో బింగ్ బింగ్ చోటు దక్కించుకుంది. ప్రస్తుతం చైనా మీడియాలో బింగ్ బింగ్ గురించి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.


Click it and Unblock the Notifications











