చనిపోయాకా కూడా అతన్ని అందలమెక్కించిన అభిమానులు...!!
2009 వ సంవత్సరం పాప్ సంగీత లోకానికి ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఇదే ఏడాదిలో పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్, 'బాయ్ జోన్' సింగర్ స్టిఫెన్ గ్యాట్లీ మృతి చెందడం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోనుంది. ఈ ఏడాది గూగుల్ సర్చ్ ఇంజన్ లో ఎక్కువ మంది వెతికిన పేరుగా స్టిఫెనా గ్యాట్లీ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏటి టాప్ మెట్రో సెలబ్రిటీగా కూడా ఈ దివంగత బాయ్ జోన్ సింగర్ ఎంపికయ్యారు.
జేడ్ గూఢీ, మైఖేల్ జాక్సన్ వంటి ప్రముఖులను అధికమించి గ్యాట్లీ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దాదాపు 44% మంది ఈ బాయ్ జోన్ స్టార్ కు మద్దతుగా ఓట్ చేసారు. గత అక్టోబరు నెల 10వ తేదీన మరణించిన గ్యాట్లీ అధిక మొత్తం లో మద్యం సేవించడం వల్ల మరణించాడని ఆరోపణలు వినిపించినా అవన్నీ బూటకం అని తేలిపోయింది. గుండె సరిగా పనిచేయకపోవడం వల్ల ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు తేల్చారు.
స్టిఫెన్ గ్యాట్లీ మైఖేల్ జాక్సన్ హాలీవుడ్ జేడ్ గూఢీ పాప్ రారాజు బాయ్ జోన్ stephen gately michael jackson jade goodi hollywood pop singer boy zone


Click it and Unblock the Notifications