ఆమె ప్రపంచ సుందరేంటండీ బాబూ..పేషెంట్ లాగా ఉంటేనూ...!!
హాలీవుడ్ హాటీ, బ్యూటీ, సెక్సీ ఏంజలీనా జోలీ తాజాగా ఓ సినిమాలో నటించడానికి అంగీకరించింది. సూపర్ హిట్ అయిన "ప్యాట్రీసియా కార్న్ వెల్" నవల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నవలా రచయిత ప్యాట్రీసియా కార్న్ వెల్ రూపొందిస్తోంది. ఇందులో ఎంజలీనా జోలీ కథానాయిక డాక్టర్ స్కార్పెట్టా పాత్రను నటించడానికి అంగీకరించింది. ఈ నవలలో స్కార్పెట్టా పాత్ర 40-45 ఏళ్ల మధ్యం వయస్కురాలయిన ఓ లెస్బియన్ మెడికల్ రిపోర్టర్. ఇందులో ఆమె షార్ట్ హెయిర్ తో ఆరోగ్యవంతంగా, ఉత్సాహవంతంగా వుంటుంది.
కానీ ఈ పాత్రకు ఏంజలీనా ఏ మాత్రం సరిపోదని నవలా అభిమానులు విమర్శిస్తున్నారు. అసలు ఏంజలీనా సన్నగా, ఓ పేషెంట్ లాగా వుంటుంది. అలాంటి ఆమెను స్కార్పెట్టా పాత్రలో ఊహించుకోవడానికే చాలా కష్టంగా వుంటుందని వారు ఆందోళన చేపట్టారు. మరి కొంత మందయితే ఆమె నటిస్తే అసలా సినిమాను నిషేధిస్తాం, ఎవ్వరం చూడమని తెగేసి చెబుతున్నారు. కాగా జోలీ ప్రస్తుతం ది టూరిస్ట్ సినిమా కోసం వెనీస్ లో షూటింగ్ లో బిజీ బిజీ గా వుంది. ఇందులో హాలీవుడ్ మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్ జానీ డెప్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











