కోట్లు ఖర్చు పెట్టారు: చెత్త సినిమా అంటూ రివ్యూలు, దారుణమైన రేటింగ్స్..

Recommended Video

Harry Potter Film Series : Fantastic Beasts The Crimes of Grindelwald Gets Worst Reviews | Filmibeat

'హారీ పొట్టర్' సిరీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ చిత్రాల్లో 10వ చిత్రం తాజాగా 'ఫెంటాస్టిక్ బీస్ట్స్- ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండల్‌వాల్డ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రఖ్యాత రచయిత జె.కె.రోలింగ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ ఫాంటసీ మూవీ నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ విమర్శకులు దీన్ని ఇప్పటి వరకు 'హారీ పొట్టర్' సిరీస్‌లో వచ్చిన అన్ని చిత్రాల కంటే చెత్త సినిమాగా పేర్కొంటున్నారు.

ఆకట్టుకోని కథాంశం

ఆకట్టుకోని కథాంశం

‘ఫెంటాస్టిక్ బీస్ట్స్- ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండల్‌వాల్డ్' కథ ఆకట్టుకోలేదని.... ఇప్పటి వరకు జెకె రోలింగ్ నుంచి వచ్చిన కథలన్నింటికంటే వరస్ట్‌గా ఉందంటూ పలువురు సినీ విమర్శకులు తమ రివ్యూల్లో ఏకి పారేశారు.

దారుణమైన రేటింగ్

దారుణమైన రేటింగ్

పలు అంతర్జాతీయ సినీ వెబ్ సైట్లు ఈ చిత్రానికి 2/5 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వలేదు. స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించే విధంగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు బాక్సాఫీసు వద్ద రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అనేది చర్చనీయాంశం అయింది.

 రూ. 1436 కోట్ల బడ్జెట్

రూ. 1436 కోట్ల బడ్జెట్

ఈ చిత్రాన్ని 200 మిలియన్ డాలర్స్ (రూ. 1436 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమా టాక్ చూస్తుంటే బాక్సాఫీసు వద్ద ప్లాప్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఫెంటాస్టిక్ బీస్ట్స్- ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండల్‌వాల్డ్

ఫెంటాస్టిక్ బీస్ట్స్- ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండల్‌వాల్డ్

ఈ చిత్రానికి డేవిడ్ యేటెస్ దర్శకత్వం వహించారు. ఎడ్డీ రెడ్మేనే, క్యాథరిన్ వాటర్స్టన్, డాన్ ఫాగ్లెర్, అలిసన్ సుడోల్, ఎజ్రా మిల్లెర్, జోయె క్రవిట్జ్ ముఖ్య పాత్రలు పోషించారు. వార్నర్ బ్రదర్స్, హేడే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X