ఫాస్ట్ & ఫ్యూరియస్ 8: ట్రైలర్ ఇరగదీసారు, సినిమా ఏంరేంజిలో ఉంటుందో?
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే.... అందులో 'ఫాస్ట్ & ఫ్యూరియస్' సిరీస్ చిత్రాలుకు అగ్రస్థానమే లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫ్రాంజైజీలో 7 సిరీస్ లు వచ్చాయి... అన్నీ సూపర్ హిట్టే. 2015లో వచ్చిన ఫాస్ట్ & ఫ్యూరియస్ 7 మూవీ ఇండియాలో భారీ విజయం సాధించింది. భారత్ లో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన తొలి హాలీవుడ్ చిత్రంగా రికార్డులకెక్కింది.

మరో సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు త్వరలోనే తెర పడబోతోంది. ఈ సిరీస్ లో వస్తున్న 8వ సీక్వెల్ 'ఫాస్ట్ & ఫ్యూరియస్ 8' 2017 ఏప్రిల్ నెలలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్లు మామూలుగా లేవు. మొత్తం 3 నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్లో సినిమాలో చూపించే హైలెట్ యాక్షన్ సీన్లను బాగా ఫోకస్ చేసారు.
ఈ చిత్రానకి ఎఫ్ గ్యారీ గ్రే దర్శకత్వం వహించారు. విన్ డీసెల్, డ్వేన్ జాన్సన్(దిరాక్), జేనస్ స్టేటమ్ లాంటి హాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మీద మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











