twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ లుక్: కొత్త జేమ్స్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

    ‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు. ఇతర తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది.

    First Look: James Bond movie 'Spectre'

    స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

    అయితే సినిమాకు కొత్త చిక్కు వచ్చి పడింది... సోనీ పిక్చర్స్ కార్యాలయంలోని కంప్యూటర్లపై దాడి చేసిన హాకర్లు సినిమా స్క్రిప్ట్ గతేడాది దొంగిలించారు. ఈ స్క్రిప్టును బటకు లీక్ చేసారని సోనీ స్టూడియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే యూకే చట్టాల ప్రకారం స్క్రిప్ట్ కు కాపీరైట్ రక్షణ ఉందని, స్క్రిప్ట్ వివరాలు ప్రచురించినా, మరేదైనా చిత్రంలూ వాడినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా, డానియల్ క్రెగ్ హీరోగా నటిస్తున్న చిత్రం వచ్చే ఈ ఏడాది నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    English summary
    It was in 2012 we have seen a bond movie for the last time with “Skyfall”. Latest spy thriller featuring the universally loved character James Bond is finally arriving this year. Titled “Spectre”, this new Bond movie’s teaser poster is released the other day. Directed by Sam Mendes who has earlier made “Skyfall” has returned to directing Bond again. English actor Daniel Craig stars in the lead role of Bond while prominent actors like Ralph Fiennes and Monica Belluci.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X