twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగ్గురి తర్వాత పుట్టిన బేబి గర్ల్ ఫోటోలను ఫేస్‌బుక్ పేజిలో..

    By Nageswara Rao
    |

    ప్రపంచంలోకి ఓ కొత్త ఫ్యామిలీ మెంబర్‌ని ఆహ్వానించారు విక్టోరియా, డేవిడ్ బెకహాం జంట. విక్టోరియా, డేవిడ్ బెకహాం జంటకు కొన్ని రోజుల క్రింద పుట్టినటువంటి మొట్టమొదటి బేబి గర్ల్ హార్పర్ సెవన్ బెకహాం‌కి సంబంధించిన పోటోలను డేవిడ్ బెకహాం తన ఫేస్‌బుక్ పేజిలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో హార్పర్ సెవన్ బెకహాం తన తల్లి విక్టోరియా బెకహాం చేతిలో జాగ్రత్తగా నిదరపోతుంది.

    సాధారణంగా సెలబ్రెటీలు వారియొక్క బేబి ముఖాలను దాస్తూ ఉంటారు. కానీ విక్టోరియా దంపతులు అలా కాకుండా తమ కుటుంబంలోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తి ఫోటోలను తన అభిమానులకు తెలియజేసేందుకు గాను ఆమె ఫోటోలను ఫేస్‌బుక్ పేజిలో పెట్టడం జరిగింది. వీరితో పాటు స్టార్ పుడ్ బాల్ ఆటగాడి అభిమానులు కూడా ఈ నెట్‌లో ఉన్న ఈ ఫోటోలను చూసి చాలా ఆనందపడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా హార్పర్ సెవన్ బెకహాం ముక్కు అచ్చం వాళ్ల అమ్మ మాదరే ఉందంటూ అభిమానులు హాల్ చల్ చేస్తున్నారు.

    డేవిడ్, విక్టోరియా బెకహాం జంటకు పుట్టిన నాల్గవ బిడ్డ హార్పర్ బెకహాం. అంతక ముందు వీరికి ముగ్గురు అబ్బాయిలు(బ్రూక్లెయిన్ జోసెప్ 12, రోమియో జేమ్స్ 8, క్రజ్ డేవిడ్ 6)సంవత్సరాలు వయసుని కలిగి ఉన్నారు. డేవిడి బెకహాం యొక్క ఫేస్‌బుక్ పేజిలో హార్పర్, విక్టోరియా బెకహాంల ఫోటోని పోస్ట్ చేసి దాని క్రింద ఈ క్రింది విధంగా రాశారు. నేను ఈ పిక్చర్‌ని నా ఇద్దరు గర్ల్స్ నిద్రపోతున్నప్పుడు తీశానని రాశారు. ఆ తర్వాత రోజు హార్పర్ సెవన్ బెకహాంతో ఫోజు ఇచ్చిన ఫోటోని తన ట్విట్టర్ పేజిలో పోస్ట్ చేసి దాని క్రింద డాడీ లిటిల్ గర్ల్ అని ట్వీట్ చేశారు.

    ఇక పుట్టిన పాపాయికి వీరు హార్పర్ సెవన్ బెకహాం అని పేరు పెట్టడానికి గల కారణాలను కూడా తెలియజేశారు. హార్పర్ అనే పేరు విక్టోరియా బెకహాంకు నచ్చిన బుక్ టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ అనే పుస్తక రచయిత పేరు నుండి తీసుకోగా, సెవన్ అనే పదం మాత్రం సెవన్ సెవన్ వండర్స్, సెవన్ కలర్స్‌లకు శుభ సూచికం కావడం మాత్రమే కాకుండా డేవిడ్ బెకహాం యొక్క లక్కీ నెంబర్. అందుకే మాకు పుట్టినటువంటి ఒకే ఒక్క బేబి గర్ల్‌కి ఈ పేరు పెట్టడం జరిగిందని అన్నారు.

    English summary
    The adorable baby girl of the Beckham couple has finally been caught on camera for the fans. Only a few days old, Harper Seven, the first baby girl of Victoria and David Beckham, is sleeping careless in her mother’s arms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X