twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటానిక్ హీరో లేటెస్ట్ మూవీ పోస్టర్ విడుదల..!

    By Kuladeep
    |

    టైటానిక్ సినిమా ద్వారా తొలి సినిమాతోనే స్టార్ హీరోగా ఎదిగిన లినార్డినో డి కాప్రియో నటించిన తాజా చిత్రం 'ఇన్సెప్షన్' సినిమా పోస్టర్ ను విడుదల చేసారు. 'ది డార్క్ నైట్' సినిమాకు దర్శకత్వం వహించిన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద మంచి అంచనాలే వున్నాయి. సైంటిఫిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కు 'యువర్ మైండ్ ఈజ్ ది సెన్స్ ఆఫ్ ది క్రైమ్' అనేది ఉపశీర్షిక.

    లినార్డినో ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో ఇంచా కెన్ వాటనెబ్, జోసెఫ్ గార్డన్ లెవిట్ లు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, మారియన్ కాటిల్లర్డ్ లినార్డిన్ భార్యగా నటిస్తోంది. కాగా ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్న పోస్టర్ ఇటీవల విడుదలయిన ఈ సినిమా పోస్టరే. ఇందులో నగరం నడిబొడ్డున లినార్డినో మోకాళ్ల వరకూ నీళ్లు నిండి వుండగా నిలబడి ఉంటడం చూస్తుంటే ఈ సినిమా కలలకు సంబంధించినదిగా హాలీవుడ్ జనాలు అంచనా వేస్తున్నారు. మరీ సినిమా ఎలాంటి సినిమా అని పూర్తిగా తెలుసుకోవాలంటే జులై 16, 2010 వరకూ ఆగక తప్పదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X