శరీరం ఫిట్‌గా ఉంటేనే ఎదుటివారి చూపులు మనపై..
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ నా శరీరానికి ఎటువంటి బట్టలు వేసుకుంటే అందం వస్తుందో అటువంటి బట్టలు మాత్రమే ధరిస్తానని అన్నారు. అంతేకాదండోయ్ ఎవరైనా ఆడవారు అందంగా కనిపించాలంటే వారు చక్కని ఫిజక్‌ని సొంతం చేసుకొవాలని అన్నారు. అప్పడు మాత్రమే మగవారి చూపులు మన శరీరంపైనా, మనపైనా ఉంటయాని అన్నారు.
మనిషి ఫిట్‌గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మనిషి ఫిట్‌గా ఉంటాడో అప్పుడు మాత్రమే చూడడానికి అందంగా కనిపిస్తాడని అన్నారు. ఇప్పటి వరకు నేను శరీరం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొబట్టే ఫిట్‌గా ఉండడమే కాకుండా, అందంగా కూడా ఉన్నానని సెలవిచ్చారు. ఈ అందమైన శరీరాన్ని సొంతం చేసుకొవడానికి నేను సుమారు రెండు సంవత్సరాలు కష్ట పడడం జరిగిందన్నారు.
42సంవత్సరాలు వయసు కలిగిన జెన్నిఫర్ లోపెజ్ ఇటీవల తన మాజీ భర్త మార్క్ ఆంటోని నుండి విడాకులు తీసుకొవడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ లోపెజ్ రాత్రుళ్లు న్యూయార్క్ వీధుల్లో ఉన్న రెస్టారెంట్ స్టార్ హీరో బ్రాడ్లీ కూపర్‌తో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనితో పాటు ఇటీవల లాస్ వేగాస్‌లో ఉన్న సీజర్స్ ప్యాలెస్‌లో ఐహాట్ రేడియో మ్యూజిక్ ఫెస్టివల్‌లో ల్యాప్ డాన్స్‌తో అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేయడం జరిగింది. ల్యాప్ డాన్స్ అంటే సాధారణంగా 'స్ట్రిప్ క్లబ్స్' లలో అర్దరాత్రి మగవారి ముందు డాన్స్ చేయడం అన్నమాట.


Click it and Unblock the Notifications











