మంచి ఫిగర్, బ్యాక్‌లెస్ డ్రస్సు.. ఇంకేమైనా ఉందా
ఫిట్‌నెస్ గురువుగా పాఠాలు చెప్పేటటువంటి జెన్నిఫర్ నికోల్ లీ మియామి బీచ్‌లో 'చో'తో జరిగిన బిజినెస్ మీటింగ్‌కి వేసుకొచ్చిన డ్రస్సు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మాజీ మిస్ బికినీ అమెరికాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జెన్నిఫర్ నికోల్ లీ ధరించిన డ్రస్సు డిజైన్ చేసిన డిజైనర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలంటున్నారు. అందుకు కారణం జెన్నిఫర్ నికోల్ లీ ధరించిన డ్రస్సు తన వీపు వెనుక భాగం మొత్తం పూర్తిగా కనిపిస్తూ అక్కడి వారి కంటికి వీనల విందు అందించింది.
జెన్నిఫర్ నికోల్ లీ ఆడవారు తమ అందనాలను ఎలా పెంపోదించుకొవాలో, ఫిట్‌గా ఉండాలంటే వారు ఏమి చేయాలో పాఠాలు చెప్పే విషయం మనకు తెలిసిందే. అంతేకాదండోయ్ జెన్నిఫర్ నికోల్ లీ యావత్ అమెరికాకి ఫిట్‌నెస్ ఐడల్ కూడా. జెన్నిఫర్ నికోల్ లీ తన రెండవ బిడ్డకి జన్మనిచ్చే సమయానికి తన బరువు 200lbs. బిడ్డకు జన్మనిచ్చన తర్వాత ఒక్కసారిగా 80lbs తగ్గిపోయి తన నాజుకైన శరీరాన్ని అందంగా తీసుకవచ్చారు. అందుకు గాను జెన్నిఫర్ నికోల్ లీ ఎంతగానో శ్రమించానని అన్నారు.
తన బరువు తగ్గే సమయంలో చేసినటువంటి వర్క్ అవుట్స్, తీసుకున్న జాగ్రత్తలు అన్నింటిని కూడా జెన్నిఫర్ నికోల్ లీ పుస్తకాలు, డివిడిలు రూపంలో అభిమానులకు అందించారు. ఇది మాత్రమే కాకుండా తాను తిరిగి మరలా బికినీ శరీర వైభవాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్బంగా తన వెబ్ సైట్ లో జెన్నిఫర్ నికోల్ లీ అభిమానులను ఉద్దేశించి ప్రతి ఒక్కరి లైప్ స్టయిల్‌ని పెంపోదంచే దిశగా ఈ ఫిట్ నెస్ ఉపయోగపడాలన్నదే జీవిత ద్యేయమని తెలిపారు.
ఇక ప్రస్తుతం జెన్నిఫర్ నికోల్ లీ ఆడవారికి ఆరోగ్య పాఠాలను తెలియజేయడమే కాకుండా, బిజినెస్ వెంచర్స్‌తో పాటు అప్పుడప్పడు టెలివిజన్ షోలలో కూడా పాల్గోంటున్నారు. మియామి బీచ్‌లో జరిగిన బిజినెస్ మీటింగ్‌కి జెన్నిఫర్ నికోల్ లీ అలా అదిరిపోయే డ్రస్సు వేసుకొని రావడానికి కారణం తనకు దుస్తుల దుకాణాలు ఉన్నాయని పబ్లిక్‌కి తెలియజేయడంతో పాటు, అందమైన డిజైన్స్ కూడా అక్కడ లభించనున్నాయని తెలియజేసేందుకేనని తర్వాత తెలిసింది. జెన్నిఫర్ నికోల్ లీ దుస్తుల దుకాణాలు సముదాయం పేరు జెఎన్‌ఎల్ కలెక్షన్. ఇందులో ఫిట్‌నెస్ మోడల్స్‌కి చెందిన అన్ని రకాల డిజైన్ దుస్తులతో పాటు, అన్ని రకాల డిజైన్స్ లభించనున్నాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











