twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ 10 లిస్ట్: ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన హీరోయిన్ ఈవిడే

    |

    ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్ ఫోర్బ్స్ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రముఖులు, సెలబ్రిటీల సంపాదన వివరాలు వెల్లడించింది. 2018-19 సంవత్సరానికి గాను ఇప్పటికే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ల వివరాలు వెల్లడించగా డ్వేన్ జాన్సన్ అలియాస్ ది రాక్ 89.4 మిలియన్ డాలర్లు(రూ. 640 కోట్ల)తో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో టాప్ 10లో అక్షయ్ కుమార్ ఒక్కరే ఇండియా నుంచి చోటు దక్కించుకున్నారు. రూ.466 కోట్ల సంపాదనతో 4వ స్థానంలో నిలిచాడు.

    తాజాగా ఫోర్బ్స్ సంస్థ హయ్యెస్ట్ పేయిడ్ నటీమణుల వివరాలు విడుదల చేసింది. ప్రముఖ నటి స్కార్లెట్ జోహన్సన్ వరుసగా రెండో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన నటిగా రికార్డుల కెక్కింది. సోఫియా వెర్గారా, రీస్ విథర్స్పూన్, నికోల్ కిడ్మాన్ లాంటి వారిని వెనక్కి నెట్టింది.

    ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించిన వివరాల ప్రకారం స్కార్లెట్ జోహన్సన్ 56 మిలియన్ డాలర్లు సంపాదించింది. మన కరెన్సీ లెక్కలో చెప్పాలంటే దాదాపు రూ. 402 కోట్లు. అవెంజర్స్ సిరీస్ చిత్రాల్లో బ్లాక్ విడో పాత్రతో పాపులర్ అయిన ఆమె మార్వెల్ సంస్థ నుంచి భారీగా పారితోషికం అందుకుంది.

    Forbes Highest-paid Actresses List: Scarlett Johansson Tops with $56 million Earnings

    రెండో స్థానంలో సోఫియా వెర్గారా నిలిచారు. ఆమె సంపాదన 44.1 మిలియన్ డాలర్లు(రూ. 316 కోట్లు). రీస్ విథర్స్పూన్ 35 మిలియన్ డాలర్ల సంపాదనతో 3వ స్థానంలో నిలిచారు. నికోల్ కిడ్మాన్ 34 మిలియన్ డాలర్లు(రూ. 244 కోట్లు)తో 4వ స్థానంలో, జెన్నిఫర్ ఆనిస్టిన్ 28 మిలియన్ డాలర్లు(రూ. 201 కోట్లు)తో 5వ స్థానంలో నిలిచారు.

    1. స్కార్లెట్ జోహన్సన్: $ 56 మిలియన్

    2. సోఫియా వెర్గారా: $ 44.1 మిలియన్

    3. రీస్ విథర్‌స్పూన్: $ 35 మిలియన్

    4. నికోల్ కిడ్మాన్: $ 34 మిలియన్

    5. జెన్నిఫర్ అనిస్టన్: $ 28 మిలియన్

    6. కాలే క్యూకో: $ 25 మిలియన్

    7. ఎలిసబెత్ మోస్: $ 24 మిలియన్

    8. మార్గోట్ రాబీ: $ 23.5 మిలియన్

    9. చార్లీజ్ థెరాన్: $ 23 మిలియన్

    10. ఎల్లెన్ పాంపీ: $ 22 మిలియన్

    English summary
    Forbes Highest-paid Actresses List released. According to "forbes.com", Johansson earned top spot with an earning of $56 million.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X