Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శృంగార తార మియా ఖలీఫా ఎంగేజ్డ్... తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!
పోర్న్ సినిమా రంగంలో ఒకప్పుడు మియా ఖలీఫా పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ శృంగార తార అభిమానుల గుండె పగలే నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ఈ బూతు సినిమా రంగానికి దూరంగా ఉంటున్న మియా ఖలీఫా త్వరలో తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతోంది.
పోర్న్‌హబ్‌లో ఎక్కువ ఆదరణ కలిగిన శృంగార తారగా పాపులర్ అయిన ఆమె... ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) నుంచి బెదిరింపులు రావడంతో ఈ ఇండస్ట్రీని వదిలేసిన సంగతి తెలిసిందే.
బాయ్ ఫ్రెండుతో మియా ఖలీఫా ఎంగేజ్మెంట్
మియా ఖలీఫా ఎంగేజ్మెంట్ తన స్వీడిష్ బాయ్‌ఫ్రెండ్, చెఫ్ రాబర్ట్ సాండ్బెర్గ్తో గతవారం జరిగింది. ఎంగేజ్మెంట్ రింగ్ ప్రదర్శిస్తూ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
చికాగోలో ప్రపోజ్ చేశాడు
మియా ఖలీఫాతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం రాబర్ట్ సాండ్‌బెర్గ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. వీకెండ్ చికాగోలో వెళ్లాం. ఇక్కడ స్టార్ హోటల్లో అద్భుతమైన డిన్నర్ చేశాం. చివరగా రింగ్ సీక్రెట్‌గా దాచిన డిష్ సర్వ్ చేయడంతో ఆమె ఆనందం, ఆశ్చర్యంలో మునిగిపోయింది, నా ప్రపోజల్ వెంటనే అంగీకరించిందని తెలిపారు.
మియా ఖలీఫాకు ఇది రెండో వివాహం
మియా ఖలీఫా తన హైస్కూల్ ఫ్రెండ్‌ను 2011లో పెళ్లాడింది. అయితే వివాహం జరిగిన మూడేళ్లకే(2016) ఇద్దరూ విడిపోయారు. త్వరలో రాబర్ట్ సాండ్బెర్గ్ను ఆమె రెండో వివాహం చేసుకోబోతోంది.
తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్
మియా ఖలీఫా ఎంగేజ్మెంట్ విషయాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలిసి హార్ట్ బ్రేక్ అయినట్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికిందరు మాత్రం రాబర్ట్ సాండ్బెర్గ్తో సంతోషకరమైన జీవితం గడుపు అంటూ విష్ చేస్తున్నారు.