twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హోటల్ రూములో శవమై తేలిన మాజీ బ్యూటీ క్వీన్... హత్యగా అనుమానం?

    |

    బ్యూటీ క్వీన్, మాజీ మిస్ ఉరుగ్వే ఫాతిమి దవెలా సోసా మెక్సికోలోని హోటల్‌లో అనుమానాస్పదంగా మరణించారు. గురువారం(మే 2) హోటల్ గదిలోని గెస్ట్ బాత్రూంలో ఆమె ఉరివేసుకుని కనిపించారు. ఫాతిమి వయసు 31 సంవత్సరాలు. మరణానికి గల కారణాలు ఏమిటో తెలియాల్సి ఉంది.

    ఫాతిమి దవెలా ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె గదిలో అనుమానం కలిగించే విధంగా కొన్ని ఆనవాళ్లు దొరకడంతో ఆ అంశాలపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

    ఫాతిమి దవెలా సోసా

    ఫాతిమి దవెలా సోసా

    ఫాతిమి దవెలా సోసా 2006లో ఉరుగ్వేలో జరిగిన మిస్ యూనివర్శ్ పోటీల్లో గెలుపొందడంతో... 2008లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికయ్యారు. కొంతకాలంగా ఆమె మెక్సికోలో మోడల్‌గా జీవనం సాగిస్తున్నారు. యూఎస్ఏలో కూడా పనిచేస్తున్నట్లు సమాచారం.

    యాక్టింగ్ నేర్చుకుంది, టీవీ రంగంలో...

    యాక్టింగ్ నేర్చుకుంది, టీవీ రంగంలో...

    ఫాతిమి దవెలా సోసా యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత సినిమా రంగం వైపు రావాలనుకున్నారు. అయితే దిశగా ఆమె ప్రయత్నాలు ఫలించేదు. అయితే టీవీ రంగంలో నటిగా అడుగు పెట్టారు. మెక్సికల్ టెలివిజన్లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో నటించారు.

    వ్యభిచారం కేసులో ఫాతిమి పేరు

    వ్యభిచారం కేసులో ఫాతిమి పేరు

    2011లో ప్రాసిట్యూషన్(వ్యభిచారం) రింగ్‌పై నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్లో పాతిమి దెవెల్లా పేరు వినినిపించింది. ఉరుగ్వే లోకల్ పత్రికలో వచ్చిన ఈ వార్తను ఇంటర్నేషనల్ వెబ్ సైట్ డైలీ మెయిల్ సైతం కవర్ చేసింది. అప్పట్లో ఈ అంశం ఉరుగ్వేలో సంచలనం అయింది.

    చివరగా 17 వారాల క్రితం

    చివరగా 17 వారాల క్రితం

    ఫాతిమి దవెలా సోసా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చివరి పోస్ట్ 17 వారాల క్రితం చేసింది. అప్పటి వరకు ఆమె ఖాతాలో పోస్ట్ అయిన ఫోటోల్లో ఎంతో సంతోషంగా కనిపించింది. ఆ తర్వాత నుంచి ఏమైందో తెలియదు ఒక్క పోస్ట్ కూడా లేదు. ఇపుడు ఆమె ఏకంగా శవమై తేలారు.

    English summary
    Former Miss Uruguay Fatimih Dávila Sosa was found dead in a hotel in Mexico City on Thursday, May 2. Fatimih Dávila Sosa was a Uruguayan model and beauty queen who was the winner of Miss Universo Uruguay 2006, where she represented Punta del Este. Since she won the national pageant, she travelled to Los Angeles, USA to represent Uruguay in the 2006 Miss Universe pageant, which was held on 23 July 2006.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X