ఒక్కొక్కటి విప్పేస్తూ...మత్తెక్కించిన స్లమ్‌డాగ్ గర్ల్!
ముంబై: స్లమ్ డాగ్ మిలియనీర్ గర్ల్ ఫ్రిదా పింటో ఇది వరకెన్నడూ లేనంత హాట్ అండ్ సెక్సీగా దర్శనం ఇచ్చింది. 28 ఏళ్ల ఈ సుందరి ఇంగ్లీష్ పాప్ మ్యూజిక్ స్టార్ బ్రూనో మార్స్ తాజా సింగిల్ ఆల్బమ్ 'గోరిల్లా'లో శృంగార రసాది దేవతలా దర్శనం ఇచ్చింది. ఈ ఆల్బమ్‌లో ఫ్రిదా పింటో తన ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పుతూ సెక్సీగా లింగరీలో దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో బ్రూనో మార్స్ తన ఫేస్‌బుక్ పేజీలో విడుదల చేసాడు.
ఈ ఆల్బంలో ఫ్రిదా పింటో బార్లో డాన్స్ చేసే గర్ల్ ఇసాబెల్లాగా నటించింది. ఇందులో ఆమె శృంగార చేష్టలు కూడా చూపించడంతో...ఈ హాట్ ఆల్బంపై అంచనాలో ఓ రేంజిలో ఉన్నాయి. 'గోరిల్లా' బ్రూనో మార్స్ యొక్క నాలుగో సింగిల్. ఈ సింగిల్ భారీగా అమ్ముడవుతుందనే అంచనాలు ఉన్నాయి.

'స్లమ్ డాగ్ మిలియనీర్' తర్వాత హాలీవుడ్ బాట పట్టిన ఫ్రిదా పింటో అక్కడ పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఉన్నట్టుండి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తూ కొత్త అవతారం ఎత్తింది. ఇటీవల విడుదలైన రిహానా, మైలే సైరస్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా దర్శనం ఇచ్చింది ఫ్రిదా పింటో.


Click it and Unblock the Notifications











