»   » పెళ్శి కాకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్..

పెళ్శి కాకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ మారిన్ కొటిల్లార్డ్ ప్రస్తుతం తన మొదటి బేబికి జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రెంచి మీడియా కొడై కూస్తుంది. మారిన్ కొటిల్లార్డ్ గత మూడు సంవత్సరాలుగా ప్రెంచి హీరో మరియు డైరెక్టర్ అయినటువంటి గులామి కానెట్ తోకలసి సహాజీవనం సాగిస్తున్నారు. పీపుల్ మ్యాగజైన్ వివరాల ప్రకారం మారిన్ కొటిల్లార్డ్ వసంత ఋతువులో తన బేబికి జన్మనివ్వ వచ్చునని తెలుస్తుంది.

2003వ సంవత్సరంలో వచ్చినటువంటి లవ్ మి ఇఫ్ యు డేర్ సినిమాలో కలసి నటించారు ఇద్దరూ. ఆసినిమా తర్వాత వీరి యొక్క బంధం బలపడడం మాత్రమే కాకుండా గత మూడు సంవత్సరాలుగా మారిన్ కొటిల్లార్డ్ మరియు గులామి కానెట్ లుఇద్దరూ కలసి సహాజీవనం సాగించడానికి కారణం అయింది. గులామి కానెట్ గిప్ట్ గా ఇచ్చినటువంటి డైమండ్ రింగ్ మాత్రం మారిన్ కొటిల్లార్డ్ తన ఎడమ చేతికి ధరించింది కాని, ఇప్పటికీ వీరిద్దరూ వీరియొక్క పెళ్శి గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu