నాకు పిల్లలు లేరు అందుకే అలా చేస్తున్నాను..!
హాలీవుడ్ అందగాడు 'జాన్ బారీమోర్' మనుమరాలే ఈ డ్రూ బారీమోర్. బారీమోర్ హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 2007 'పీపుల్స్ మ్యాగజైన్' కవరు పేజి పై అందగత్తె గా దర్శనమిచ్చారు. అంతే కాకుండా బారీమోర్ 2007లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారించారు. ఈ ప్రోగ్రామ్ కీ గాను డ్రూ బారీమోర్1మిలియన్ డాలర్లును విరాళంగా యిచ్చారు.
ఇటీవల కాలంలో ఈ అమ్మడు తన ఫ్రెండ్స్ ని తెగ వెనకేసుకోస్తోంది. నేను నా ఫ్రెండ్స్ ని ఒక ఫ్యామిలి గా భావిస్తాను. వాళ్శే నాకు ప్రాణం అంటుంది. నాకు ఫ్రెండ్స్ లేకపోతే నేను జీవించలేను అంటోంది. నా ప్రక్కన వాళ్శు ఉంటే నేను లగ్జరిగా జీవించగలను అంటోంది. అంతేకాకుండా నా జీవితంలో నేను ఇచ్చే మొట్టమొదటి ప్రయారిటి నా స్నేహితులకేనని అంటోంది. అంతేకాకుండా ఈ 35 సంనత్సరాల వయసుగల సుందరి ఎక్కడికి వెళితే అక్కడ స్నేహితులను పరిచయం చేసుకుంటానని అంటోంది. హాటల్స్, అపార్ట్ మెంట్స్, వీకెండ్ బ్రేక్స్ లలో కూడా స్నేహితులకు టచ్ లో ఉంటానంటోంది.
స్నేహితులను పరిచయం చేసుకోవడానికి ఒక చిన్న నవ్వు చాలు అంటోంది. అంతేకాకుండా ఎవరైనా డిన్నర్స్, వీకెండ్స్ లో పార్టీలు పెట్టినా అందరం కలసిమెలసి, సరదాగా ఎంజాయ్ చేస్తామని అంటోంది. ఇలాంటివి చేయడం అన్నా నాకు కూడా నాకు భలే సరదా చెప్పుకోచ్చింది. మా ఇంట్లో డిన్నర్స్ ఏరేంజ్ చేసినప్పుడు నేను వైన్ అందస్తానని చెప్పుకోచ్చింది. ఇలా ఫ్రెండ్స్ పరిచయం చేసుకోవడానికి కారణం ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ హీరో జస్టిన్ లాంగ్ తో డేటింగ్ తో పోల్గోన్నప్పటికి సంతానం కలగలేదు. కాని పిల్లలు అంటే మన అమ్మడికి ప్రాణం. అందుకే ఇలా పార్టీలు, డిన్నర్స్ పెట్టి ప్రక్క వాళ్శ పిల్లలతో తన ముద్దు ముచ్చట తీర్చుకుంటుంది.


Click it and Unblock the Notifications











