ఫ్రొజెన్ II: సవాళ్లకు, మార్పులకు ఎదురొడ్డే అన్నా.. ఆనందమే పరమావధిగా
ఫ్రొజెన్ మూవీలో తన సోదరి ఎల్సా సురక్షితంగా ఉండాలని కోరుకొంటుంది. అలాగే ఐస్‌మ్యాన్ క్రిస్టోఫ్, స్నోమ్యాన్ ఒలాఫ్, రియిండీర్ స్వెన్‌తో కలిసి జీవించాలని కోరుకొంటుంది. అంతేకాకుండా తమ నివాసం అరెండెల్లే కూడా ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంది. ప్రస్తుతం అన్ని చోట్ల నుంచి ముప్పు సంకేతాలు ఉండటంతో ఓ సాహోసోపేతమైన ప్రయాణానికి సిద్ధమైంది. తమ నివాసం అరెండెల్లే ప్రశాంతకు ముప్పు కలిగే సంకేతాలు ఉండటం, అలాగే ఎల్సా ఎదో విపత్తు వస్తుందనే విషయాన్ని గ్రహించిన అన్నా తన సోదరికి అండగా నిలుస్తుంది. ఈ విషయంపై దర్శకుడు క్రిస్ బుక్ స్పందిస్తూ.. తొలి చిత్రంలో అన్నా కోల్పోయిందేమీ ఉండదు. కానీ ఇప్పుడు సర్వం కోల్పోయే స్థితిలో కనిపిస్తుంది అని అన్నారు.
అన్నా పాత్ర సానుకూల ఆశావాద దృక్పథంతో కనిపించే సాహోసోపేతమైన పాత్ర. తన కుటుంబ క్షేమాన్ని కోరుకొనే వ్యక్తి. తమ ఇల్లు, కుటుంబం బాగుంటే తను చాలా సంతోషంగా ఉంటారు. తను ఒంటరితనాన్ని ఎన్నడూ కోరుకోదు. జీవితానికి ఎదైనా సవాల్ ఎదురైనప్పుడు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉంటుంది.

ఫ్రొజెన్ సినిమాలో అన్నా పాత్ర గురించి దర్శక, రచయిత జెన్నీఫర్ లీ మాట్లాడుతూ.. పురాణ, జానపద నేపథ్యంతో సాహసగాధ పాత్రలకు అతీంద్రియ శక్తులు ఉండవు. కానీ వారు ఓ మాయ ప్రపంచంలో జీవిస్తుంటారు. ఎదురయ్యే సవాళ్లకు ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉంటారు. విజయం కోసం ఎలాంటి అడ్డంకులనైనా ధీరత్వంతో ఎదుర్కొంటారు అని అన్నారు.
సమ్ థింగ్స్ నెవర్ ఛేంజ్ అనే పాట ద్వారా అన్నా క్యారెక్టర్ ఎంత పాజిటివ్‌గా ఉంటుందనే విషయం స్పష్టమవుతుంది. కాలగమనంలో కొన్ని మార్పులు తప్పనిసరి కావడంతో వాటికి అనుగుణంగా ప్రయాణం సాగిస్తుంది. తన మనగడను, ఉనికిని, తన అస్థిత్వాన్ని తెలుసుకొనేందుకు తన శక్తిని పరీక్షించుకొంటుంది. తన సోదరి ఎల్సాకు కవచంలా, అడ్డుగోడలా నిలుస్తూ ఎల్లవేళలా కాపాడుతుంటుంది. అందుకు తగినట్టుగానే అన్నాకు ఎల్సా ఓ మాట చెబుతూ.. మంటల్లోకి నీవు వెళ్లకుండా నన్ను ఫాలో కావాలి.. అంటే.. అయితే నీవు మంటల్లోకి వెళ్లకు అంటూ సమాధానం ఇస్తుంది. సాహోసోపేతమైన పోరాటాలకు దిగడం ఇష్టం లేకపోయినా.. కానీ ఆమె మానసిక ధైర్యంతో ముందుకు రావడం ఆ పాత్రకు ఆకర్షణగా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











