ఫ్రొజెన్ II: ఎల్సాకు అతీంద్రియ శక్తులు ఎలా సంక్రమించాయంటే?
హాలీవుడ్ చిత్రం ఫ్రొజెన్‌లో ఎల్సాకు అతీంద్రియ శక్తులు ఎలా వచ్చాయనే విషయాన్ని స్పష్టంగా తెరకెక్కిస్తే.. ఇక దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రంలో ఆమెకు ఆ శక్తులు ఎలా, ఎందుకు సంక్రమించాయనే కోణంలో కథను రూపొందించారు. ఫ్రొజెన్‌లో దొరకని ప్రశ్నలకు సమాధానంగా ఈ సీక్వెల్‌లో దొరుకుతాయి. సముద్రాలు, దట్టమైన అడవుల వెంట ఎల్సా సాహోసోపేతమైన ప్రయాణం సాగిందనే విషయాన్ని ప్రేక్షకులకు దర్శక, నిర్మాతలు చెప్పబోతున్నారు. నదీ ప్రవాహంపై అక్కాచెల్లెల్లు ఎల్సా, అన్నాకు తమ తల్లి చెప్పిన విషయాలు సమాధానంగా నిలుస్తాయి. తనకు వినిపించిన ఆకాశవాణి మాటలను తొలుత ఎల్సా పట్టించుకోదు. కానీ క్రమ క్రమంగా ఆ గొంతును అనుసరించడం ప్రారంభిస్తుంది. ఎల్సాలోని సందిగ్దతను ఆమె పాడే Into The Unknownలో
నన్ను ఇష్టపడే వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా?
నా వాస్తవ జీవితాన్ని తెలిసిన వారెవరైనా ఉన్నారా?
నా శక్తులన్నీ బలపడుతుంటే.. ప్రతీ రోజు నాకు జీవించడం కష్టమవుతుంది
ఇలాంటి సుదీర్ఘ ప్రయాణంలో తోడు ఉండాలనే విషయం మీకు తెలుసా అంటూ సాగే పాట ద్వారా మనకు స్పష్టత వస్తుంది.

ఎల్సా ను చిత్ర దర్శక, నిర్మాతలు ఓ పురాణ నేపథ్యం ఉన్న పాత్రగా గుర్తించారు. ఈ సందర్భంగా నిర్మాత పీటర్ డెల్ వెచో మాట్లాడుతూ.. పురాణాల్లో ఉంటే కార్యెక్టర్ల మాదిరిగా మనం చేయలేని విధంగా భూప్రపంచ భారాన్ని ఎల్సా తన భుజాల మీద మోస్తుంటుంది. అంతేకాకుండా ఆమెను విషాదకరమైన రితీలో విధి వెంటాడుతుంటుంది.
ఎల్సా పాత్రను చూస్తే.. ఓ జీవితం కంటే పెద్దగా ఉంటుంది. ప్రస్తుత సీక్వెల్‌లో ఆ పాత్ర ప్రభావం కనిపిస్తుంది. ఆమె సముద్ర శక్తిని ఎదురించడం, భూమిపై ఉండే అతిపెద్ద దుష్టశక్తులతో తలపడటం, ఓ దశలో కూడా అగ్నితో చెలగాటం ఆడటం ట్రైలర్‌లో చిన్న ఝలక్‌ల రూపంలో కనిపిస్తాయి.
ఫ్రొజెన్ సీక్వెల్‌లో ఎల్సా శక్తులు పరీక్షించబడుతాయి. అంతేకాకుండా ఆమె ఫర్‌ఫెక్ట్‌గా మహారాణి అనే విషయం తెలుస్తుంది. తన తేజస్సును కొనుగొనడానికి కొన్ని ఊహకు అందని వాస్తవాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తనకు ఇష్టమైన జీవితాన్ని కొనుగొనే సాహోసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అందుకోసం ఎలాంటి రిస్క్‌నైనా తనకు తాను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది.


Click it and Unblock the Notifications











