twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రోజెన్‌కు సీక్వెల్ అవసరమా? ఆమెకు అతీంద్రియ శక్తులు ఎలా వచ్చాయి?

    |

    మ్యూజికల్ ఫాంటసీ చిత్రంగా 2013లో రూపొందిన ఫ్రోజెన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొన్నది. ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పడమే కాకుండా, ఊహాజనిత సాహసగాధకు సరికొత్త రూపంగా నిలవడమే కాకుండా హీరోయిన్‌కు సంబంధించిన భావనలను కూడా ఈ చిత్రం కొత్తగా నిర్వచించింది. సుఖాంతంగా నిలిచే ఈ చిత్రానికి సీక్వెల్ అవసరమా అంటే దర్శక, రచయిత జెన్నీఫర్ చెప్పిన విషయం ఇలా ఉంది.

    ఒకవేళ ఫ్రోజెన్ సుఖాంతంతో కూడిన చిత్రమని అనుకొంటే.. ఫ్రోజెన్ 2 కూడా అదే కోవలోకి వస్తుంది. జీవన ప్రయాణం అదే విధంగా సాగిపోతుంటుంది. అద్భుతమైన ఫీలింగ్‌ను నీ హృదయంలో వదలివెళ్తుంది. ప్రపంచంలో నీ ఉనికిని చాటుకోవడానికి చేసే సరైన పంథాలో పోరాటాన్ని నేర్పుతుంది. ఈ చిత్రం వినోదం, హాస్యంతో కూడిన ఎమోషనల్ స్టోరీ ఇంది.

    Frozen sequel: Why was Elsa born with magical powers?

    ఫ్రోజెన్ మూవీలో కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించకుండానే ఉంటాయి. సిస్టర్స్ ఎల్సా, అన్నా తల్లిదండ్రులు ఎవరు? ఓడ ప్రమాదానికి గురైనప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు? అతీంద్రియ శక్తులతో ఎల్సా ఎందుకు పుట్టిందనే ప్రధానమైన ప్రశ్నగా ప్రేక్షకులను వెంటాడుతుంది.

    ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలే రచయితలను మరోసారి సిస్టర్స్ ఎల్సా, అన్నా గురించి రాసేందుకు అవకాశం లభించింది. అందర్నీ ఆకట్టుకొనే పర్వతారోహకుడు క్రిస్టాఫ్, మంచు కొండల్లో జీవిస్తూ వేసవి కోసం పరితపించే ఓలాఫ్ గురించి తెలియని విషయాలను ఈ సీక్వెల్‌ వివరిస్తుంది.

    Frozen sequel: Why was Elsa born with magical powers?

    ఇక నిర్మాత పీటర్ డెల్ వెచో మాట్లాడుతూ.. ఫ్రోజెన్‌లోని క్యారెక్టర్లు చాలా ఆసక్తిగా మనకు మధురమైన అనుభూతిని అందిస్తుంది. అలాంటి ఫీల్‌గుడ్ కథ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది అని అన్నారు.

    డైరెక్టర్ బుక్ మాట్లాడుతూ.. ఫ్రోజెన్‌ చిత్రంలో ఓ ప్రపంచం ఈ క్యారెక్టర్ల కోసం ద్వారాలు తెరిచింది. ఎల్సా, అన్నా పాత్రలు తమ ఉనికి, అస్థిత్వం గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తాయి. ఈ కథలో వారిద్దరూ కాలేజీ విద్యను పూర్తి చేసి గ్రాడ్యుయేట్స్ అవుతారు. వారిద్దరు కలిసి మెలిసి ప్రేమతో జీవిస్తుంటారు. ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమను మరింత తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. తన గతానికి సంబంధించిన తన మాటలను వినడంతో సరికొత్త సాహసయాత్ర మొదలవుతుంది. అదే ఆమెను వెంటాడుతున్న ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు దోహదం చేస్తుంది. గతంలోని మాటలను పక్కన పెట్టే చేసినప్పటికీ.. అవి అలానే తనను వెంటాడుతుండటంతో చివరకు తనకు తెలియని జీవితాన్ని తెలుసుకొనేందుకు ముందుకెళ్తుంది అని అన్నారు.

    English summary
    Frozen, the 2013 animated musical fantasy film, was a global superhit. It redefined love, re-told the fairytale and shook up the traditional notions of a heroine. Frozen also had its 'happily ever after', the all's well that ends well that defines magical stories. So what was the need of a sequel?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X