»   » భారీ అప్పుల్లో ప్రియాంక చోప్రాకు కాబోయే మామ!

భారీ అప్పుల్లో ప్రియాంక చోప్రాకు కాబోయే మామ!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Priyanka Chopra's Father-In-Law Falls In Debts

    బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ... ప్రియాంక త్వరలో అడుగు పెట్టబోయే అత్తారింటికి సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశం అయింది.

    నిక్ జొనాస్ తండ్రి... పాల్ జొనాస్ అమెరికాలో రియల్ ఎస్టేట్ కంపెనీ రన్ చేస్తున్నారు. వీరి వ్యాపారం ఇపుడు భారీ నష్టాల్లో ఉందట. దాదాపు 1 మిలియన్ డాలర్ అప్పుల్లో కూరుకుపోయిందట. దీంతో పాటు ఓ కేసు కారణంగా దాదాపు రెండున్నర లక్షల డాలర్లకుపైగా నష్టపోవాల్సి వచ్చిందట.

    అప్పుల విషయం హాట్ టాపిక్

    అప్పుల విషయం హాట్ టాపిక్

    ఇంటర్నేషనల్ హాలీవుడ్ వెబ్ సైట్ టిఎంజెడ్ కథనం ప్రకారం... ఆ అప్పుల కారణంగా తన ఆస్తుల్లో కొన్నింటిని పాల్ జొనాస్ కోల్పోనున్నట్లు టాక్. పాల్ త్వరలో ప్రియాంకకు కాబోయే మామగారు కావడంతో ఈ విషయం ఇండియన్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయింది.

    నిక్ జొనాస్

    నిక్ జొనాస్

    ఆ సంగతి పక్కన పెడితే ప్రియాంకను పెళ్లాడబోయే నిక్ 2013 వరకు తన సోదరులతో కలిసి చాలా ఆల్బమ్స్ చేశాడు. వీరి రికార్డ్స్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా అమ్ముడయ్యాయి. వీరి బ్యాండ్ బ్రేకప్ అయిన తర్వాత నుండి ముగ్గురు సోదరులు ఎవరికి వారు సొంతగా తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు.

     నటుడిగా నిక్ ప్రయత్నాలు

    నటుడిగా నిక్ ప్రయత్నాలు

    ఇప్పటి వరకు నిక్ జొనాస్ దాదాపు 25 మిలియన్ డాలర్లు సంపాదించాడట. ఇందులో ఎక్కువ శాతం సోలో ఆర్టిస్టుగా సంపాదించినవే. ఇటీవల వచ్చిన ‘జుమాంజి' సినిమాలో నటించిన నిక్ నటుడిగా కూడా తన కెరీర్ మలుచుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

    వివాహం ఎప్పుడు?

    వివాహం ఎప్పుడు?

    కాగా... ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వివాహం వచ్చే ఏడాది యూఎస్ఏలో జరిగే అవకాశం ఉంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన దృష్టంతా హాలీవుడ్ కెరీర్ మీదనే పెట్టింది. ఇండియాలో సినిమాల సంఖ్య కూడా చాలా తగ్గించేసింది. భవిష్యత్లో ఈ బ్యూటీ యూఎస్ఏలో సెటిలయ్యే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    A Real Estate company of Paul Jonas, father of American singer Nick Jonas and future father-in-law of actress Priyanka Chopra, has over $1 million in debt, including a $268k judgement from a case his company lost. According to TMZ, it is said that in order to come up with the cash, Paul's plans to see of come of the New Jersey construction and real estate company's property.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more