మోస్ట్ ఛారిటబుల్ స్టార్స్‌గా గాగా, బైబర్
2011వ సంవత్సరానికి గాను మోస్ట్ ఛారిటబుల్ స్టార్స్‌గా పాప్ స్టార్ లేడిగాగా, టీనేజి సెన్సేషన్ జస్టిన్ బైబర్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వెబ్ సైట్ 'డుసమ్‌ధింగ్.ఓర్జీ' నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఛారిటీ సేవలను అందిస్తున్న కొంత మంది టాప్ సెలబ్రిటీలను తీసుకొని ఈ వెబ్‌సైట్ పోల్ నిర్వహించగా, టాప్ 20 టాప్ లిస్ట్‌లో వోకల్ ఛాంపియన్ అయిన లేడిగాగా మొదటి స్దానాన్ని కైవసం చేసుకున్నారు.
టీనేజి సింగర్ జస్టిన్ బైబర్ తన ఆట పాటలతో తాను సంపాదించిన మొత్తంలో ఛారిటీ సంస్ధలకు ఇస్తున్న విషయం తెలిసిందే. తన స్వస్దలం కెనడాలో ఉన్న ' లోకల్ పుడ్ బ్యాంక్' ని ఆదుకునందుకు గాను క్రిస్‌మస్‌కి ముందు జస్టిన్ బైబర్ ఫ్రీ క్రిస్‌మస్ ట్రిప్‌ని నిర్వహించి దాని ద్వారా వచ్చిన డబ్బుని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు జస్టిన్ బైబర్ చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా నిధిని ఇస్తున్నారు.
'డుసమ్‌ధింగ్.ఓర్జీ' వెబ్ సైట్ నిర్వహించిన పోల్‌లో టాప్ 5 సెలబ్రిటీల లిస్ట్‌లో హాలీవుడ్ స్టార్ హీరో జార్జి క్లూనీ, విల్ స్మిత్, విల్ స్మిత్ భార్య జాడా, టైటానిక్ సూపర్ హీరో లియోనార్డో డికాప్రియో మొదలగున వారున్నారు.


Click it and Unblock the Notifications











