తండ్రికి సాయంగా రెస్టారెంట్ బాధ్యతలు
హాలీవుడ్ పాప్ సింగర్ లేడిగాగా తన తండ్రి 'జోయాన్నేట్రటోరియా' కొత్తగా న్యూయార్క్‌లో ప్రారంభించనున్న ఇటాలియన్ రెస్టారెంట్ ఓపెనింగ్‌లో భాగంగా తనవంతు సహాయాన్ని అందిస్తుంది. లేడిగాగా తన తండ్రి రెస్టారెంట్‌లో ఉన్న మెను ఐటమ్స్ గురించి అడ్వర్టైజింగ్‌లో బిజీగా ఉంది. మెనులో అన్ని ఐటమ్స్ కూడా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోని రూపొందించారు. ముఖ్యమైన ఐటమ్స్‌గా గ్రాండ్ మా రోసీ, మెటా బాల్స్, మినీ-మార్టిన్స్, నుటల్లా డోనట్స్ ఉన్నాయి.
ఇక రెస్టారెంట్‌లో ఉన్న గోడలకు అందమైన డిజైనర్స్‌ని రూపొందించే భాద్యతను లేడిగాగా చెల్లెలు నటాలీ తీసుకుంది. ఈ రెస్టారెంట్‌ని లేడిగాగా తండ్రి 'జోయాన్నేట్రటోరియా'తో పాటు, అమెరికా సెలబ్రిటీ చెఫ్ కళ స్మిత్ సంయుక్తంగా నిర్వహించనున్నారు. తన రెస్టారెంట్ విషయంలో కూతుళ్లు ఇద్దరూ సహాయం అందిస్తున్నందుకు లేడిగాగా తండ్రి ఎంతో ఆనందిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే లేడిగాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. మొన్నటి మొన్న పాప్ సింగర్ జస్టిన్ బైబర్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో 16 మిలియన్ల మంది ఫాలో అవుతుండడంతో నెంబర్ వన్ స్దానంలో కొనసాగారు. కానీ ఇప్పడు ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ లేడిగాగా ట్విట్టర్‌లో ఓ సరిక్రొత్త రికార్డుని సృష్టించారు. ఇంతకీ లేడిగాగా సృష్టించిన ఆ ప్రపంచ రికార్డు ఏమిటంటే లేడిగాగా మైక్రో బ్లాగింగ్ ఎకౌంట్ ట్విట్టర్‌ని 18 మిలియన్ల ఫాలోవర్స్ ఫాలో అవ్వడమే.


Click it and Unblock the Notifications











