ఎక్కువ డబ్బు సంపాదించిన సింగర్ ఎవరు..?
2011వ సంవత్సరానికి గాను మ్యూజిక్ లిస్ట్‌లో అత్యధికంగా డబ్బులు సంపాదించే ప్రముఖ సెలబ్రిటీగా టేలర్ షిప్ట్, క్యాటి పెర్రీని దాటుకోని పాప్ స్టార్ లేడీగాగా మొదటి స్దానంలో ఉన్నారు. ఫోర్బ్.కామ్ ప్రచురించినే దాని ప్రకారం లేడిగాగా గత 12 నెలలో ఏ పాప్ సింగర్ కూడా సంపాదించలేనంత డబ్బుని సంపాదించడం జరిగింది. ఇంతకీ లేడీ గాగా ఎంత సంపాదించిందని అనుకుంటున్నారా.. $90 మిలియన్లు.
ఇక రెండవ స్దానాన్ని సింగర్ టేలర్ షిప్ట్ $45 మిలియన్లతో కైవసం చేసుకున్నారు. మూడవ స్దానాన్ని క్యాటి పెర్రి $44 మిలియన్లతో కైవసం చేసుకున్నారు. నాలుగు, ఐదు స్దానాలను బేయాన్స్, రిహానాలు $35, $29 మిలియన్లతో సొంతం చేసుకున్నారు. లేడిగాగా సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం 'మోనస్టర్ బాల్' టూర్‌లో రావడం జరిగిందన్నారు. ఈ టూర్‌లో ఒక్క రాత్రిలో లేడిగాగా సుమారు $1.3 మిలియన్లను సంపాదించి ఆశ్చర్యం కలగజేశారు. అంతేకాకుండా వీటితో పాటు కొన్ని అధికారిక డీల్స్‌లో పాల్గోనడం వల్ల ఎక్కువ డబ్బుని 2011వ సంవత్సరానికి గాను సంపాదించారు.


Click it and Unblock the Notifications











