ప్రవర్తన మార్చుకోవాలని తండ్రికి వార్నింగ్: పాప్ స్టార్
పాప్ స్టార్ లేడిగాగా తన తండ్రికి వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ లేడిగాగాకి తండ్రి 'జోసెఫ్ జెర్మనోట్టా' పై కోపం వచ్చేంతలా ఆయన ఏమిచేశాడని అనుకుంటున్నారా.. న్యూయార్క్ మెట్స్ బేస్ బాల్ మ్యాచ్‌లో ఫోటోగ్రాఫర్ల వైపు అనుచితంగా తన కుడి చేయి మద్య వేలుని చూపించి గాగా ఆగ్రహానికి గురయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న 25 సంవత్సరాల లేడిగాగా ఫోటోగ్రాఫర్లకు క్షమాపణ తెలియజేసింది. ఈ సందర్బంలో గాగా మాట్లాడుతూ తన తండ్రికి ఇష్టమైన టీమ్ ఓటమిని భరించ లేక ఏదో అ సందర్బంగా అలా చేశాడని తెలిపింది. అంతేకాకుండా రెండు సంవత్సరాల తర్వాత మా తండ్రి గారిని తిట్టడం జరిగిందన్నారు. అంతక ముందు 2010లో ఒక పబ్లిక్ పార్టికి గెస్టుగా వెళ్లినప్పడు అక్కడ మొదటసారి మా తండ్రి సరిగా ప్రవర్తించకపోవడంతో తిట్టడం జరిగిందని తెలిపింది.
దీనికి ముందు లేడిగాగా తన తండ్రి 'జోయాన్నేట్రటోరియా' కొత్తగా న్యూయార్క్‌లో ప్రారంభించనున్న ఇటాలియన్ రెస్టారెంట్ ఓపెనింగ్‌లో భాగంగా తనవంతు సహాయాన్ని అందిస్తుంది. లేడిగాగా తన తండ్రి రెస్టారెంట్‌లో ఉన్న మెను ఐటమ్స్ గురించి అడ్వర్టైజింగ్‌లో బిజీగా ఉంది. మెనులో అన్ని ఐటమ్స్ కూడా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోని రూపొందించారు. ముఖ్యమైన ఐటమ్స్‌గా గ్రాండ్ మా రోసీ, మెటా బాల్స్, మినీ-మార్టిన్స్, నుటల్లా డోనట్స్ ఉన్నాయి.
ఇక రెస్టారెంట్‌లో ఉన్న గోడలకు అందమైన డిజైనర్స్‌ని రూపొందించే భాద్యతను లేడిగాగా చెల్లెలు నటాలీ తీసుకుంది. ఈ రెస్టారెంట్‌ని లేడిగాగా తండ్రి 'జోయాన్నేట్రటోరియా'తో పాటు, అమెరికా సెలబ్రిటీ చెఫ్ కళ స్మిత్ సంయుక్తంగా నిర్వహించనున్నారు. తన రెస్టారెంట్ విషయంలో కూతుళ్లు ఇద్దరూ సహాయం అందిస్తున్నందుకు లేడిగాగా తండ్రి ఎంతో ఆనందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











