అభిమానుల కోసం ట్విట్టర్‌లో ముఖం వాచిపోయిన ఫోటో
లండన్, జూన్ 13: హాలీవుడ్ పాప్ స్టార్ లేడీగాగా ఒక సంగీత కచేరీలో మెటల్ పోల్‌ని పట్టుకోని డ్యాన్స్ చేస్తుండగా.. సడన్‌గా అది జారిపోవడంతో గాయపడడం.. ఆ తర్వాతఅర్దాంతరంగా ఆక్కడి నుండి వెళ్లి పోయారు. పోల్ నుండి క్రింద పడి పోవడంతో ఆమె తలకు గాయం అవడమే కాకుండా ముఖం కూడా వాచిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోని లేడిగాగా స్వయంగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
26 సంవత్సరాల వయసు కలిగిన లేడిగాగా ఆదివారం న్యూజిల్యాండ్‌లోని ఆస్క్ ల్యాండ్‌లో కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని గాగా అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రమాదంపై అభిమానులు కంగారు పడతారేమోనని ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తన ట్విట్టర్ ద్వారా వారితో పంచుకుంటున్నారు. ఈ సందర్బంగా గాగా తన ట్విట్టర్‌లో "శ్రద్ద సందేశాల పంపిస్తున్న అందరికి చాలా ధన్యవాదాలు. మొదట్లో కాస్ ఇబ్బంది పడ్డప్పటికీ.. రోజు రోజుకీ నేను కోలుకుంటున్నా" నని ట్వీట్ చేశారు.
ఇటీవలే ప్రపంచంలో తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో 25 మిలియన్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న అరుదైన రికార్డుని హాలీవుడ్ పాప్ సింగర్ లేడి గాగా సాధించారు. వెంటనే అభిమానులకు తన కృతజ్ఞతలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 26 సంవత్సరాల వయసు కలిగిన లేడిగాగా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో "# 25milliontweetymonsters వావ్! ఈరోజు నేను అధికారకంగా ప్రపంచంలో లక్కీయస్ట్ అమ్మాయిని అయినంత ఫీలింగ్ కలుగుతుందని" ట్వీట్ చేసింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











