హార్వర్డ్‌లో లేడిగాగా 'బార్న్ దిస్ వే ఫౌండేషన్'...

By Nageswara Rao

పాప్ స్టార్ లేడీ గాగా వచ్చే నెల హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 'బార్న్ దిస్ వే ఫౌండేషన్' ని ప్రారంభించనుంది. 25 ఏళ్ల వయసు కలిగిన గాగా యువతను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోని, ఆమె తల్లి 'సింథియా జర్మనోట్టా'తో కలసి, మొదటగా అమెరికా ఆధారిత విశ్వవిద్యాలయంలో ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

ఈ సందర్బంలో లేడిగాగా తల్లి 'సింథియా జర్మనోట్టా' మాట్లాడుతూ మా కూతురు ప్రారంభించనున్న ఈ ఫౌండేషన్ మెరుగైన ప్రపంచ సృష్టించడానికి ఆమె మనసులో నుండి వచ్చిన ఆలోచన అని అన్నారు. మనందరం కలసి కలిసి ఒక కొత్త ఉద్యమం సృష్టించడడానికి మరియు యువతను చైతన్య వంతులను చేసి మన సమాజంలోని విలువైన సభ్యులకు చోటుని కల్పిద్దామని అన్నారు.

ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకోని రూపొందిస్తున్న కార్యక్రమం కాబట్టే దీనిని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభిస్తున్నామన్నారు. ఇటీవల లేడిగాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. మొన్నటి మొన్న పాప్ సింగర్ జస్టిన్ బైబర్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో 16 మిలియన్ల మంది ఫాలో అవుతుండడంతో నెంబర్ వన్ స్దానంలో కొనసాగారు. కానీ ఇప్పడు ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ లేడిగాగా ట్విట్టర్‌లో ఓ సరిక్రొత్త రికార్డుని సృష్టించారు. ఇంతకీ లేడిగాగా సృష్టించిన ఆ ప్రపంచ రికార్డు ఏమిటంటే లేడిగాగా మైక్రో బ్లాగింగ్ ఎకౌంట్ ట్విట్టర్‌ని 18 మిలియన్ల ఫాలోవర్స్ ఫాలో అవ్వడమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X