ఎమ్‌టివి అవార్డులలో తారల కొలాహాలం
పాప్ ప్రపంచపు రాణి లేడిగాగా ఇటీవల ప్రకటించిన ఎమ్‌టివి ఈఎమ్ఎ అవార్డుల కార్యక్రమంలో నాలుగు ఈఎమ్ఎ అవార్డులను సొంతం చేసుకుంది. మొత్తం ఆరు కేటగిరిలలో నామినేట్ అవ్వగా నాలుగు ఈఎమ్ఎ అవార్డులను సొంతం చేసుకుంది. లేడిగాగా రూపొందించిన 'బార్న్ దిస్ వే' అనే ఆల్బమ్‌కు గాను ఈ అవార్డులను సొంతం చేసుకుంది.
లేడిగాగా మొత్తం ఆరు విభాగాలకు గాను అవార్డుని పోందిన నాలుగు విభాగాలు ఇవే.
* ఉత్తమ నటి
* ఉత్తమ పాట
* ఉత్తమ వీడియో
* ఉత్తమ అభిమాని
ఉత్తమ అభిమాని అంటే ప్రపంచ వ్యాప్తంగా లేడిగాగాకి ఉన్న అభిమాన సంఘాలను ఆధారంగా చేసుకొని ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఇక మగవారి కేటగిరికి వస్తే జస్టిన్ బైబర్, బ్రూనో మార్స్ ఇద్దరూ కూడా రెండేసి అవార్డులను సొంతం చేసుకొవడం జరిగింది. జస్టిన్ బైబర్ ఉత్తమ నటుడు, ఉత్తమ పాప్‌కి అవార్డులను కైవసం చేసుకున్నాడు.
* ఉత్తమ పాప్
* ఉత్తమ నటుడు
ఉత్తమ ఆర్టిస్ట్ అవార్డుని బ్రూనో మార్స్ కైవసం చేసుకున్నాడు. క్యాటి పెర్రి బెస్ట్ లైవ్ ప్రదర్శనలకు గాను అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ రాక్ ఫెర్పామెన్స్‌కు లింకన్ పార్క్ పేరుని ప్రదిపాదించడం జరిగింది. సింగర్ జెస్సీ జె ఇటీవల మరణించిన అమీ వైన్ హౌస్‌కి సంబంధించిన వీడియోని ప్రదర్శించాడు.


Click it and Unblock the Notifications











