twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపుల హీరోను తొలగించండి.. వండర్ ఉమెన్ హీరోయిన్ సీరియస్

    వండర్ ఉమెన్ చిత్రంతో హీరోయిన్ గాల్ గ్యాడట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలుగించార గాడట్. వండర్ ఉమెన్ చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌కు రంగం చేస్తున్నారు.

    By Rajababu
    |

    Recommended Video

    Gal Gadot Refuses To Sign Wonder Woman Sequel !

    వండర్ ఉమెన్ చిత్రంతో హీరోయిన్ గాల్ గ్యాడట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలుగించారు గ్యాడట్. వండర్ ఉమెన్ చిత్రం ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌కు రంగం చేస్తున్నారు. నిర్మాతలు. అయితే నిర్మాతలకు గ్యాడట్ గట్టిగా షాకిచ్చింది. ఇంతకీ ఏమి జరిగిందంటే..

    వండర్ ఉమెన్2కు ఒప్పుకోను

    వండర్ ఉమెన్2కు ఒప్పుకోను

    వండర్ ఉమెన్ బ్లాక్ బస్టర్ కావడంతో దానికి సీక్వెల్ రూపొందించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే లైంగిక వేధింపులకు పాల్పడిన హీరో బ్రెట్ రాట్నర్‌ను తొలగించేంత వరకు తాను సినిమా అగ్రిమెంట్‌పై సంతకం చేయనని ఆమె స్పష్టం చేయడం వివాదంగా మారింది.

    బ్రెట్ రాట్నర్‌పై లైంగిక వేధింపులు

    బ్రెట్ రాట్నర్‌పై లైంగిక వేధింపులు

    వండర్ ఉమెన్ చిత్రానికి రాట్నర్ ఫైనాన్స్ అందించారు. వండర్ ఉమెన్ చిత్రం సాధించిన కలెక్షన్ల నుంచి 412 మిలియన్ డాలర్లను లాభంగా సంపాదించారు. అయితే తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై ఆరుగు మహిళలు ఆరోపణలు చేయడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో అతని వాటాను కొనుగోలు చేయమని వార్నర్ బ్రదర్స్‌ను గాడట్ ఒత్తిడి చేస్తున్నది.

    ఆరోపణలు తప్పు

    ఆరోపణలు తప్పు

    అయితే తనపై వచ్చిన ఆరోపణలను బ్రేట్ రాట్నర్ ఖండించారు. స్వతహాగా లాయర్ కూడా కావడంతో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు. దర్శకుడు హర్వే వీన్‌స్టెయిన్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో బ్రెట్ రాట్నర్‌పై అలాంటి విమర్శలు రావడం హలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

    రాట్నర్ వాటా కొనుగోలు చేయండి

    రాట్నర్ వాటా కొనుగోలు చేయండి

    ఇలాంటి పరిస్థితుల్లో రాట్నర్ వాటాను వార్నర్ బ్రదర్స్ కొనుగులో చేస్తే తప్ప వండర్ ఉమెన్2 గ్రీన్ సిగ్నల్ ఇవ్వను అని గాల్ గ్యాడట్ స్పష్టం చేసింది. మహిళా సాధికారిత నేపథ్యంగా రూపొందించే చిత్రానికి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి ఫైనాన్స్ చేయడం ఎంత మాత్రం సరికాదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

    English summary
    Wonder Woman star, Gal Gadot, has reportedly refused to sign the sequel to the blockbuster, unless accused sexual harasser Brett Ratner is removed from the production of the film. "They can't have a movie rooted in women's empowerment being financed by a man accused of sexual misconduct against women," the insider added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X