బూతు సినిమానే...కానీ అందులో ఆరోగ్య సందేశం!
సిడ్నీ: మనదేశంలో పోర్న్ సినిమాలపై నిషేదం ఉన్న సంగతి తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి సినిమాలు చట్టబద్దమే. తాజాగా ఓ పోర్న్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇది బూతు సినిమా, అశ్లీల సినిమా అయినప్పటికీ ఇందులో ఓ హెల్త్ మెసేజ్ ఉంటమే ఇందుకు కారణం.

ఓ ఆస్ట్రేలియన్ అడ్వర్టెజింగ్ ఏజెన్సీ, ఓ అడల్ట్ ఫిల్మ్ స్టూడియో కలిసి ఈ పోర్న్ మూవీని తెరకెక్కించారు. టెస్టికల్స్(వృషణాలు) క్యాన్సర్ మీద అవగాహన కల్పిచేందుకే ఈ పోర్న్ మూవీ తెరకెక్కించామని చెబుతున్నారు. ‘గేమ్ ఆప్ బాల్స్' పేరుతో రూపొందించిన ఈ పోర్న్ మూవీలో పోర్న్ స్టార్ ఇవా లోవియా నటించారు.
ఇందులో...పురుషులు తమకు టెస్టికల్స్(వృషణాలు) ఆరోగ్యంగా ఉన్నాయా? లేదా ఏమైనా సమస్య ఉందా? క్యాన్సర్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి... అనే విషయాలపై చర్చిస్తూ ఈ పోర్న్ మూవీ తెరకెక్కించారు. ఆరోగ్యానికి సంబంధించిన సందేశం ఉండటంపై కొందరు ప్రశంసిస్తున్నా....ఈ సందేశం చెప్పడానికి మరీ ఇంత బూతు మార్గాన్ని ఎంచుకోవాలా? వేరే రకంగా చెప్పొచ్చుగా? అని విమర్శించే వారూ ఉన్నారు.


Click it and Unblock the Notifications











