Game of Thrones యాక్టర్ కన్నుమూత.. తీవ్ర దిగ్బ్రాంతిలో హాలీవుడ్

నార్త్ ఐరీష్‌కు చెందిన కమెడియన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేం బీజే హాగ్ కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. అయితే ఆయన మరణం వెనుక కారణాలు బయటకు రాలేదు. కానీ బీజే హాగ్ మృతి వార్తను ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ ధృవీకరించింది. హాగ్ సన్నిహితులు బీబీసీతో మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అద్భుతమైన నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆయన మరణ వార్తతో నేను తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బీబీసీ నార్తర్న్ ఐర్లాండ్ సిరీస్ గివ్ మై హెడ్ పీస్‌లో బిగ్ మెర్విన్ అనే పాత్రలో అద్బుతంగా నటించారు. దాదాపు ఆ సిరీస్ 20 ఏళ్లపాటు సాగింది. హాగ్ మరణం సందర్భంగా యూనిట్ శ్రద్ధాంజలి ఘటించింది. అద్బుతమైన నటుడు, కొలీగ్, మంచి స్నేహితుడు అని పేర్కొన్నారు. హౌస్ లానిస్టర్‌లో బ్యానర్ మ్యాన్‌గా హాగ్ కీలక పాత్రను పోషించాడు. అలాగే ధి ఫాల్ అనే సిరీస్‌లో మొదటి, మూడు స్థానాల్లో నటించాడు.

Game of Thrones actor BJ Hogg died at 65

హాగ్ మరణం సందర్భంగా గివ్ మై హెడ్ పీస్ యూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మరణవార్తతో తీవ్ర దిగ్రాంతికి లోనయ్యాం. మా కుటుంబంలో గొప్ప వ్యక్తిని కోల్పోయాం. బీజే ఆత్మకు శాంతి చేకూరాలి అని యూనిట్ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X