100 కోట్ల... రికార్డ్ బద్దలు కొట్టిన ‘గాంగ్నమ్ స్టైల్’
న్యూయార్క్: సౌత్ కొరియన్ డాన్సింగ్ వీడియో 'గాంగ్నమ్ స్టైల్' సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వీడియో యూట్యూబులో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో అత్యధిక మంది చూసిన వీడియోగా ఇది రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోను ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్(100 కోట్లు)కు పైగా మంది వీక్షించారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఏ వీడియోకు కూడా 100 కోట్ల హిట్స్ రాలేదు.
ఇది వరకు అత్యధిక వీక్షకులు చూసిన వీడియోగా జస్టిన్ బేబర్స్ ఆల్బమ్ 'బేబీ' అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు దాన్ని 'గాంగ్నమ్ స్టైల్' అధిగమించింది. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వీడియోను దక్షిణ కొరియా పాప్ స్టార్ 'ప్సై' ఈ ఏడాది జూలైలో యూట్యూబులో అప్ లోడ్ చేసారు.
ట్యూన్స్ జోష్ ఫుల్ గా ఉండటం... ఈ ఇందులో 'ప్సై' వేసిన స్టెప్పులు అద్భుతంగా, వింతంగా, ఆకట్టుకునే విధంగా ఉండటంతో అందరూ దీన్నీ ఫాలో అవుతూ వచ్చారు. స్టార్ ప్లేయర్లు, సినిమా స్టార్లు పబ్లిక్‌గా ఈ స్టెప్పులు వేయడంతో అనతి కాలంలోనే ఇది బాగా పాపులర్ అయింది. ఈ వీడియో అప్ లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియోను సగటున రోజుకు 70 లక్ష నుంచి కోటి మంది వీక్షించే వారట. త్వరలో ఈ సాంగుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కబోతోంది.


Click it and Unblock the Notifications











