»   » ఐదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలు.... ఇదే ఇపుడు నెం.1, బీట్ చేయడం కష్టమే!

ఐదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలు.... ఇదే ఇపుడు నెం.1, బీట్ చేయడం కష్టమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గంగ్నమ్ స్టైల్' పాట గుర్తుందా.... అప్పట్లో ఈ పాటతో యావత్ ప్రపంచమే ఊగిపోయింది. యూట్యూబ్ లో ఈ ఆల్బం వీడియో ఓ సంచ‌ల‌నం. సౌత్ కొరియా‌కు చెందిన సింగ‌ర్ సై గంగ్నమ్ సైల్ ఆల్బంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు.

జులై 15, 2012‌న యూట్యూబ్‌లో రిలీజ‌యిన గంగ్న‌మ్ స్టైల్ సాంగ్ గ‌త ఐదేళ్లుగా వ్యూస్ పరంగా నెం.1 పొజిషన్లోనే ఉంది. ఆ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 2.896 బలియన్(289 కోట్లు) వ్యూస్ సాధించింది. నిన్న మొన్నటి వరకు ఇదే నెం.1గా ఉండేది.... కానీ అమెరికన్ సాంగ్ ఆల్బమ్ సీ యూ ఎగైన్.... 'గంగ్నమ్ స్టైల్'ను సెకండ్ పొజిసన్లోకి నెట్టేసింది.

సీయూ ఎగైన్

ప్రస్తుతం యూట్యూబ్‌లో నెం. Wiz Khalifa - See You Again. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ యాక్ట‌ర్ పాల్ వాక‌ర్ కార్ యాక్సిడెంట్ లో చ‌నిపోయిన తర్వాత.... ఆయ‌న జ్ఞాప‌కార్థం ఈ వీడియో ను రూపొందించారు. ఏప్రిల్ 6, 2015 న ఈ వీడియో రిలీజ‌్ అవ్వగా....ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోకు 2.903 బిలియన్ వ్యూస్ (290 కోట్లకు పైగా ) వ్యూస్ వచ్చాయి.

నెం. 2 గంగ్నమ్

గంగ్న‌మ్ స్టైల్ వీడియో కు ఇప్పటి వరకు ఉన్న వ్యూస్ మొత్తం 2,896,363,483.

నెం. 3

జస్టిన్ బీబర్ సారీ ఆల్బమ్ 2.640 బిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో ఉంది.

నెం. 4

మార్క్ రాన్సన్ పాడిన అప్ టైమ్ ఫంక్ ఆల్బమ్ నెం.4 పొజిషన్లో ఉంది. ఈ పాటకు 2.552 బిలియన్ వ్యూస్ వచ్చాయి.

నెం. 5

లూయిన్ ఫోన్సీ ఆల్బమ్ డిస్పాసిటో ఆల్బమ్ నెం. 5 పొజిషన్లో ఉంది. దీనికి 2.526 బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ పాట ఈ ఏడాది జనవరిలో విడుదలై అప్పుడే టాప్ 5లో చోటు దక్కించుకోవడం విశేషం.

English summary
"Gangnam Style" is no longer the most-watched video on YouTube. That new honor has now been bestowed on the music video for "See You Again," the tearjerker of a song from Wiz Khalifa and Charlie Puth that featured at the end of 2015's Furious 7 as a tribute to actor Paul Walker, who passed away in a car crash in 2013 before production was completed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X