గెట్లీ మరణానికి తానే కారణం అంటున్న 'గే' స్నేహితుడు
ప్రముఖ పాప్ సింగర్ స్టిఫెన్ గెట్లీ మరణంతో ఆయన 'గే' స్నేహితుడు ఆండీ కౌలెస్ తీవ్ర మనోవేధనకు గురవుతున్నాడు. తన స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. అక్టోబరు 10, గెట్లీ మరణించిన రోజున ఆయనతోనే కలసి వున్న ఆండీ, ఆయన మరణ వార్త విన్నప్పటి నుండీ ఏకధాటిగా ఏడుస్తూనే వున్నాడు. తను గెట్లీ పక్క గదిలోనే పడుకున్నానని, తన ప్రాణమిత్రుడు మరణంతో పోరాడుతున్నా తెలుసుకోలేక పోయానని, దీనికి తనని తాను క్షమించుకోలేక పోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
ఇదిలా వుండగా ఆండీ, గెట్లీలు 'గే' స్నేహితులుగా చాలా కాలం నుండీ కొనసాగుతున్నారు. అక్టోబరు 10న ఇద్దరూ కలసి మద్యం సేవించి వేరు వేరు గదుల్లో పడుకున్నారు. తెల్లవారే సరికి తన మిత్రుడు ఇక లేడన్న విషయాన్ని విన్న ఆండీ వాళ్లు కలసి వున్న రోజుల్ని తలచుకొంటూ బాధపడుతున్నాడు. ఆండీని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇప్పుడంతా ఆండీ గురించి బాధపడుతున్నారు. కాగా అతి తాగుడే గెట్లీ మరణానికి కారణమని తెలిసింది.


Click it and Unblock the Notifications











