‘నా భార్యను కూడా లైంగికంగా వేధించారు’.. భోరుమన్న ప్రముఖ నటుడు

హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టెన్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. అతడి బాధితులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు.

By Bojja Kumar

హాలీవుడ్ సర్కిల్‌లో స్టార్ ప్రొడ్యూసర్ హార్వీ వెయిన్‌స్టెన్ సెక్స్ స్కాండల్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆయన వల్ల లైంగిక వేధింపులకు గురైన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ అతడి బండారాన్ని బయట పెడుతున్నారు.

కాగా... హార్వీ వెయిన్‌స్టెన్ సినిమాల ద్వారా హీరోగా లాంచ్ అయి 90ల్లో హాలీవుడ్లో స్టార్స్‌గా ఓ వెలుగు వెలిగిన జార్జ్ క్లూనీ, మాట్ డామన్‌లు అతడి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అతడి ప్రవర్తన గురించి తమకు కొంత వరకు తెలుసన్నారు.

అతడితో ఐదు నిమిషాలు గడిపితే ఎవరికైనా తెలుస్తుంది

అతడితో ఐదు నిమిషాలు గడిపితే ఎవరికైనా తెలుస్తుంది

క్లూనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సబుర్బికాన్' సినిమాలో మాట్ డామన్ కూడా నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న వారికి హార్వీ వెయిన్‌స్టెన్ గురించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అతడితో ఐదు నిమిషాలు స్పెండ్ చేస్తే అతడి గురించి మీకూ తెలుస్తుందని మాట్ డామన్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Recommended Video

Priyanka Chopra making over herself to sustain in hollywood
నా భార్యకు కూడా వేధింపులు

నా భార్యకు కూడా వేధింపులు

డైరెక్టర్ క్లూనీ మాట్లాడుతూ... వర్క్ ప్లేసులో లైంగిక వేధింపులు అనే మాట తరచూ వింటూ ఉంటాం, తన భార్య అమల్ క్లూనీ కూడా వర్క్ ప్లేసులో లైంగిక వేధింపులు ఎదుర్కొందని, అయితే కొందరిలా దాన్ని బిగ్ ఇష్యూ చేసి చెప్పలేదని క్లూనీ తెలిపారు.

 మిస్ కండక్ట్ గురించి తెలియదు కాని

మిస్ కండక్ట్ గురించి తెలియదు కాని

వెయిన్‌స్టెన్ తనకు ఎఫైర్లు ఉన్నాయని చెప్పుకుంటాడు. ఇది అందరికీ తెలుసు. కానీ అతడు నటీమణులతో మిస్‌బిహేవ్ చేసినట్లు మాత్రం తమకు తెలియదు అని మాట్ డామన్ వెల్లడించారు.

హార్వీ వెయిన్‌స్టెన్ బాధితులు

హార్వీ వెయిన్‌స్టెన్ బాధితులు

ఏంజెలీనా జోలీ, గైనెత్ పాల్ట్రో లాంటి ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్లను సైతం వెయిన్‌స్టెన్ ద్వారా వేధింపులకు గురైన వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 మంది నటీమణులు వెయిన్‌స్టెన్ వేధింపుల గురించి మీడియాకు వెల్లడించారు.

ఐశ్వర్యరాయ్ మీద కూడా కన్ను పడింది

ఐశ్వర్యరాయ్ మీద కూడా కన్ను పడింది

హాలీవుడ్లో అవకాశాల కోసం ఆమె ప్రయత్నిస్తున్న రోజుల్లో హార్వే వెయిన్‌స్టన్‌ కన్ను ఐశ్వర్యరాయ్ మీద కూడా పడిందట. అప్పట్లో ఐశ్వర్యరాయ్ మేనేజర్‌గా పని చేసిన సిమోనె షెఫీల్డ్ షాకింగ్ విషయం బయట పెట్టింది. ఐశ్వ‌ర్య‌తో ఒంట‌రిగా స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని తనను హార్వే వెయిన్‌స్టన్ చాలా సార్లు బలవంతం పెట్టాడని, అతడి మనసులో ఉన్న తప్పుడు ఉద్దేశ్యం తాను ముందే పసిగట్టి తాను ఏర్పాటు చేయను అని మొహం మీదే చెప్పానని సిమోనె షెఫీల్డ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X