twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ సింగర్‌ హఠాన్మరణం, ఎ ఆర్ రహమాన్ సంతాపం

    బ్రిటిష్‌ ప్రముఖ పాప్‌ సింగర్‌ జార్జి మైఖేల్‌ (53) హఠాన్మరణం చెందారు.

    By Srikanya
    |

    లండన్‌ : ఈ క్రిసమస్ ..పాప్ సంగీత ప్రపంచానికి అన్యాయం చేసింది. 'ఇఫ్‌ యూ వర్‌ దేర్‌'', 'ఐ యామ్‌ యువర్‌ మ్యాన్‌', 'ఎవ్రిథింగ్‌ షీ వాంట్స్‌' వంటి పాటలను ఆలపించడం ద్వారా 1980లలో పాప్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బ్రిటిష్‌ ప్రముఖ పాప్‌ సింగర్‌ జార్జి మైఖేల్‌ (53) హఠాన్మరణం చెందారు.

    ఆదివారం క్రిస్మస్‌ రోజున లండన్‌లోని తన ఇంట్లో నిద్రిస్తుండగా ప్రశాంతస్థితిలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారని ఆయన వ్యక్తిగత సహాయకుడు మైఖేల్‌ లిప్‌మ్యాన్‌ వెల్లడించారు. గుండె వైఫల్యంతోనే ఆయన మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.

    జార్జి మైఖేల్‌ పూర్తి పేరు.. జార్జియస్‌ కిరియాకాస్‌ పనయెట్సు. తన స్నేహితుడు ఆండ్రూ రిడ్జర్లీతో కలిసి 1981లో ''వామ్‌'' అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ను స్థాపించి ప్రదర్శనలు ఇవ్వడంతో మైఖేల్‌ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 'క్లబ్‌ ట్రోపికానా', 'లాస్ట్‌ క్రిస్మస్‌' వంటి ఆల్బమ్స్‌తో వీరి పేర్లు సంగీత ప్రపంచంలో మార్మోగాయి.

    'కేర్‌లెస్‌ విష్పర్‌', 'ఫెయిత', 'అవుట్‌సైడ్‌', 'ఫ్రీడమ్‌ 90' వంటివి మైఖేల్‌ కేరీర్‌లో అత్యుత్తమంగా నిలిచాయి. 'గ్రామీ' సహా పలు అవార్డులు వరించాయి. మైఖేల్‌ మృతిపట్ల హాలీవుడ్‌ నటులు మడోన్నా, ర్యాన్‌ రేనాల్డ్స్‌, బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహార్‌, ఏఆర్‌ రెహమాన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

    English summary
    The star, who launched his career with Wham! in the 1980s and had huge success as a solo performer, "passed away peacefully" on Christmas Day in Goring, Oxfordshire, his publicist said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X