హాలీవుడ్ నటి అనుమానాస్పద మృతి.. అదృశ్యమై విగత జీవిగా..
హలీవుడ్‌లో అద్బుతమైన ప్రతిభతో ఆకట్టుకొంటున్న యువ నటి, గాయని నయా రివేరా దుర్మరణం చెందారు. ఆమె అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత మృతదేహాన్ని సదరన్ కాలిఫోర్నియా లేక్‌లో కనుగొన్నారు. ఆమె వయసు 33 సంవత్సరాలు. గ్లీ అనే కామెడీ సినిమా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. నయా రివేరా మృతితో హాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
నయా రివేరా అనుమానాస్పద మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం లేక్ పిరూ ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆమె విగతజీవిగా మారి కనిపించింది. నయా మరణించిన ఆరు రోజుల తర్వాత కుమారుడు ఆమె మృతదేహాన్ని గుర్తించారు అని వెంచూరా కౌంటీ షెరీఫ్ పోలీసులు తెలిపారు.

నయా రివేరా నాలుగేళ్ల వయసులో బాలతారగా యాక్టింగ్‌లోకి అడుగుపెట్టారు. గ్లీ టెలివిజన్ సిరీస్లో లెస్బియన్ పాత్రలో అద్భుతమైన ప్రతిభను కనబరచడంతో మంచి గుర్తింపు లభించింది. 2009 నుంచి 2015లో వరకు ఫాక్స్ ఛానెల్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌కు అనూహ్యమైన ప్రేక్షకాదరణ లభించింది. ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్, ఫ్యామిలీ మ్యాటర్స్, ది బెర్నీ మ్యాక్ షోలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
నయా రివేరా మృతిపై గ్లీ సిరీస్ యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. నయా మరణంతో షాక్ గురయ్యాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ గ్లీ సిరీస్‌లో నటించిన సహ నటుడు జేన్ లించ్ ట్విట్టర్‌లో సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











