83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి అయిన నటుడు.. 29 ఏళ్ల యువతితో సహజీవనం
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో తన యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. గాడ్ ఫాదర్ మూవీతో ఎంతో అలరించిన ఈ నటుడు 83 ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. అది కూడా నాలుగోసారి. గత కొద్దికాలంగా హాలీవుడ్ ప్రొడ్యూసర్ నూర్ అల్ఫాల్లాతో అల్ పాసినో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. ఇప్పుడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు అలీ పాసినో-నూర్ అల్ఫాల్లా జంట.
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి అయ్యారు. అతని స్నేహితురాలు, నిర్మాత అయిన 29 ఏళ్ల నూర్ అల్ఫల్లా కుమారుడికి జన్మనిచ్చింది. అతనికి రోమన్ పాసినో అని పేరు పెట్టినట్లుగా సమాచారం. అయితే అల్ పాసినోకు ఇంతకుముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు. నూర్ అల్ఫల్లాకు ముందు యాక్టింగ్ కోచ్ జాన్ టర్రాంట్‌తో రిలేషన్ లో ఉన్న అల్ పాసినోకు పుట్టిన 33 ఏళ్ల కుమార్తె ఉంది.

అలాగే మాజీ ప్రేయసి బేవర్లీ డీ ఏంజెల్లాతో అల్ పాసినోకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఇక ఇప్పుడు నిర్మాత నూర్ అల్ఫాల్లాతో నాలుగో బిడ్డకు తండ్రిగా మారారు అలీ పాసినో. ఈ గాడ్ ఫాదర్ నటుడి పర్సనల్ విషయాలను చూస్తే 1988 నుంచి 1989 వరకు జాన్ టర్రాంట్‌తో సంబంధం కొనసాగించారు. అనంతరం 1997 నుంచి 2003 వరకు బెవెర్లీ డీ ఏంజెల్లాతో సహ జీవనం చేశారు. ఆ తర్వాత లుసిలా పొలాక్‌తో 2008 నుంచి 2018 వరకు రిలేషన్ మెయింటేన్ చేసిన అల్ పాసినో 60 ఏళ్ల బిలియనీర్ నకోలస్ బెర్గ్రెన్ తో కూడా సంబంధం ఉండేదని టాక్.
ఇక అల్ పాసినో సినిమాల విషయానికొస్తే.. 1972లో క్లాసిక్ హిట్ అయిన గాడ్ ఫాదర్ మూవీతో ఫేమ్ సంపాదించుకున్నారు. స్కార్ పేస్, హీట్, సెర్పికో, సీ ఆఫ్ లవ్, ది డెవిల్స్ అడ్వకేట్ వంటి చిత్రాలలో నటించారు. అలాగే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ది ఐరిష్ మ్యాన్, హౌస్ ఆఫ్ గూచి, ది పైరెట్స్ ఆఫ్ సోమాలియా చిత్రాలతో సైతం ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











