83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పసినో.. 29 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌తో సహజీవనంతో.. !

తన నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకొన్న హాలీవుడ్‌ సీనియర్ నటుడు అల్ పసినో 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత కొద్దికాలంగా నిర్మాత నూర్ అల్ఫాల్లా‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మను ప్రసాదించేందుకు సిద్దమవుతున్నారు. లేటు వయసులో అల్ పసినో తండ్రి కాబోతున్నారనే వార్త వరల్డ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆల్ పసినో వయసు 83 సంవత్సరాలు. నూర్ అల్ఫాల్లా వయసు 29 ఏళ్లు. వీరిద్దరూ 2022 నుంచి సహజీవనం చేస్తున్నట్టు వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అల్ పసినో, నూర్ పలు చోట్ల కనిపిస్తూ, చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారిద్దరు డేటింగ్‌ చేస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది. కానీ ఆ ఇద్దరు తమ బంధం గురించి ఎప్పుడూ పెదవి విప్పి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరో నెల రోజుల్లో నూర్ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారనే విషయాన్ని ఆమె సన్నిహితులు ధృవీకరించారు.

God Father star Al Pacino expecting his fourth child with Girl friend Noor Alfaallah

అల్ పసినో వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయనకు నూర్ అల్ఫాల్లాతో పుట్టే బిడ్డ నాలుగో సంతానం అనే విషయం గమనార్హం. గతంలో యాక్టింగ్ కోచ్ జాన్ టర్రాంట్‌తో రిలేషన్ కారణంగా పుట్టిన 33 ఏళ్ల కూతురు ఉంది. అలాగే మాజీ ప్రేయసి బేవర్లీ డీ అంజెల్లోతో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం నిర్మాత నూర్‌తో నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకొన్న ఆల్ పసినో దాంపత్య జీవిత విషయానికి వస్తే.. 1988 నుంచి 1989 వరకు జాన్ టర్రంట్‌తో రిలేషన్‌ కొనసాగించారు. ఆ తర్వాత బెవెర్లీ డీ ఏంజెల్లోతో 1997 నుంచి 2003 వరకు సహ జీవనం చేశారు.ఆ తర్వాత లుసిలా పొలాక్‌తో 2008 నుంచి 2018 వరకు రిలేషన్ కొనసాగించారు. ప్రస్తుతం నూర్ అల్ఫాల్లాతో సహ జీవనం చేస్తున్నారు.

God Father star Al Pacino expecting his fourth child with Girl friend Noor Alfaallah

హాలీవుడ్ నిర్మాత నూర్ అల్ఫాల్లా విషయానికి వస్తే.. గతంలో ఇద్దరు ప్రముఖులతో రిలేషన్‌షిప్ కొనసాగించారు. తొలుత సింగ్ మిక్ జాగర్‌తో డేటింగ్ చేశారు. ఆ తర్వాత సంపన్న పారిశ్రామిక వేత్త నికోలాస్ బెర్గ్ర్యూన్‌తో బంధాన్ని కొనసాగించారు. వీరిద్దరితో ఎక్కువ కాలం రిలేషన్ కొనసాగలేదు. ప్రస్తుతం అల్ పసినోతో సహజీవనం చేస్తున్నారు.

అల్ పసినో కెరీర్ విషయానికి వస్తే.. 1969లో మీ నాటలే అనే మూవీతో సినిమా రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత 1972లో ది గాడ్ ఫాదర్ సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. 1974లో ది గాడ్ ఫాదర్ పార్ట్ 2లో నటించారు. ఆ తర్వాత రెవల్యూషన్, సీ ఆఫ్ లవ్, స్కార్ ఫేస్, సెంట్ ఆఫ్ ఏ ఉమెన్, అడ్వకేట్, ది ఇన్‌సైడర్ చిత్రాల్లో నటించారు. తాజాగా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ది ఐరీష్ మ్యాన్, ది పైరేట్స్ ఆఫ్ సోమాలియా తదితర చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X