షాకింగ్: Godzilla vs Kong హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ లీక్.. రిలీజైన కొద్దిగంటల్లోనే ఆ వెబ్‌సైట్లలో..

కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యంత శ్రమతో తెరకెక్కించే సినిమాలు పైరసీ బారిన పడటం ఎంత కష్టంగా ఉంటుందో అందరికి తెలుసు. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజైన కొద్ది గంటల్లోనే వాటికి సంబంధించిన హెచ్‌డీ ప్రింట్స్ సోషల్ మీడియాలో లీక్ కావడం అందర్నీ షాక్ గురిచేస్తున్నది. తాజాగా అలాంటి దెబ్బకు గురైన చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. ఈ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే దాని ప్రింట్ పలు గ్రూపులో దర్శనమిచ్చింది. ఈ లీక్ గురించి వివరాల్లోకి వెళితే..

పైరసీ బారిన పడ్డ భారీ బడ్జెట్ సినిమాలు

పైరసీ బారిన పడ్డ భారీ బడ్జెట్ సినిమాలు


సినిమాల లీక్ వ్యవహారంలో భాషాభేదం లేకుండా పోయినట్టు కనిపిస్తున్నది. దక్షిణాది చిత్రాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, పలుమార్లు ఓటీటీలో రిలీజైన సినిమాలు కూడా పైరసీ రక్కసికి బలి అవుతున్నాయి. ఇటీవల కాలంలో జాతి రత్నాలు, శ్రీకారం, ముంబై సాగా, లక్ష్మీ, ఆశ్రమ్ 2, లుడో లాంటి చిత్రాలు పైరసీ వెబ్‌సైట్ల దాడికి గురయ్యాయి.

అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

ఐకానిక్ మాన్‌స్టర్స్ మరోసారి తెరపైకి

ఐకానిక్ మాన్‌స్టర్స్ మరోసారి తెరపైకి


ఇక గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ విషయానికి వస్తే.. 2019లో రూపొందిన గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్‌స్టర్స్, అలాగే కాంగ్: స్కల్ ఐలాండ్ లాంటి రెండు చిత్రాల్లో కనిపించిన ఐకానిక్ మాన్‌స్టర్స్ కలిపి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ రూపొందించారు. ఈ చిత్రానికి ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించారు.

రెండు రోజుల ముందుగానే రిలీజ్

రెండు రోజుల ముందుగానే రిలీజ్

గాడ్జిల్లా, కాంగ్ పాత్రలకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను గమనించి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రాన్ని విదేశాల్లో రిలీజ్ కంటే రెండు రోజుల ముందుగానే భారత్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సాధారణంగా శుక్రవారం రిలీజ్‌ అనే సంప్రదాయాన్ని పక్కన పెట్టి బుధవారమే ఈ సినిమాను రిలీజ్ చేశారు.

తమిళ్ రాకర్స్, మూవీరూల్జ్, టెలిగ్రామ్‌లో

తమిళ్ రాకర్స్, మూవీరూల్జ్, టెలిగ్రామ్‌లో

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం రిలీజైన కొద్దిగంటల్లోనే తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వెబ్‌సైట్స్, టెలిగ్రామ్, లాంటి సోషల్ మీడియా యాప్‌లో మంచి క్వాలిటీతో ప్రింట్ విస్తృతంగా ప్రచారమైంది. హిందీ, పలు భాషలకు సంబంధించిన హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ పైరసీ జరిగింది. ఫ్రీ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇవ్వడంతో సినిమా వసూళ్లపై భారీగా ప్రభావం పడే అవకావం కనిపిస్తున్నది.

200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో

200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం సుమారు 200 మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కింది. అంటే14,75,30,00,000 రూపాయలు. ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్ లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుకొన్న చిత్రం ఏప్రిల్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేసుకొన్నది. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2020 నవంబర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనావైరస్ వ్యాప్తి కారణంగా సినిమాను నిలిపివేశారు.

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో

మాన్‌స్టర్ సినిమాల్లో నాలుగో సీక్వెల్‌గా వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందింది. అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, మిల్లీ బాబీ బ్రౌన్, రెబెకా హాల్, బ్రెయిన్ టైరీ హెన్రీ, షన్ ఊగురీ, ఐజీ గంజాలేజ్, జూలియన్ డెన్నీసన్, కైలీ చాండ్లర్ లాంటి తారలు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X