Just In
- 30 min ago
చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్
- 37 min ago
సలార్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.. హై వోల్టేజ్ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
- 1 hr ago
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- 1 hr ago
పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు
Don't Miss!
- Sports
ICC Test Rankings: దూసుకెళ్లిన రోహిత్ శర్మ, అశ్విన్.. హిట్‌మ్యాన్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్!
- News
కూతురి మాటలకు, పీవీ బతికుంటే ఆత్మహత్య -సీపీఐ నారాయణ సంచలనం -ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్
- Finance
దారుణంగా పతనమైన బిట్‌కాయిన్, మార్చి నుండి ఇదే వరస్ట్
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాలకు భారీ స్పందన వస్తుంటుంది. అందులోనూ గ్రాఫిక్స్‌తో రూపొందే సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. గతంలో ఈ తరహాలో వచ్చిన ఎన్నో చిత్రాలు విశేషమైన రెస్పాన్స్‌ను అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో 'కింగ్ కాంగ్', 'గాడ్జిల్లా' సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో వీటికి కొనసాగింపుగా కొన్ని భాగాలు కూడా
వచ్చాయి. అయితే, ఈ సారి ఈ రెండింటినీ కలుపుతూ 'గాడ్జిల్లా vs కాంగ్' అనే సినిమాను రూపొందించారు. దీన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అందుకే అన్ని భాషల్లోనూ తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ఆడమ్ వింగార్డ్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ రూపొందించిన చిత్రమే 'గాడ్జిల్లా vs కాంగ్'. ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇక, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం 'గాడ్జిల్లా vs కాంగ్' ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. వీఎఫ్ఎక్స్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా కొన్ని పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

సముద్రంలో ఉండే గాడ్జిల్లా విజృంభిస్తూ ఎంతో నష్టాన్ని కలిగిస్తుటుంది. దీంతో కాంగ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించుకుంటారు. అయితే, ఆ కాంగ్ మాత్రం ఓ చిన్నారి చెప్పినట్లుగానే వ్యవహరిస్తుంటుంది. ఇందుకోసం ముందుగా ఆ చిన్నారిని తీసుకొచ్చి, ఆ తర్వాత కాంగ్‌తో అక్కడి పరిస్థితిని వివరిస్తారు. అప్పటి నుంచి గాడ్జిల్లాను అంతం చేసేందుకు కాంగ్ ప్రయత్నిస్తుంది. అలా.. చివరకు గాడ్జిల్లాను కాంగ్ ఎలా అంతమొందించింది అన్న దానిపై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక, ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది.