Godzilla vs. Kong ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: ఎందులో విడుదల కాబోతుందంటే!

హాలీవుడ్‌లో వచ్చే అడ్వెంచరస్ మూవీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోన్న విషయం తెలిసిందే. అందులోనూ జంతువులకు సంబంధించిన ఫ్రాంచేజీలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. వాటిలో 'కింగ్ కాంగ్', 'గాడ్జిల్లా' నుంచి వచ్చిన సిరీస్‌లు ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే వీటికి కొనసాగింపుగా ఎన్నో సినిమాలు రూపొందాయి. ఈ క్రమంలోనే ఈ రెండింటినీ కలుపుతూ 'గాడ్జిల్లా vs కాంగ్' అనే సినిమాను రూపొందించారు. దీన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఆడమ్ వింగార్డ్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ తీసిన చిత్రమే 'గాడ్జిల్లా vs కాంగ్'. కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. ఇక, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాజాగా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది.

Godzilla vs. Kong Release on Amazon Prime

వీఎఫ్ఎక్స్‌ వండర్‌గా రూపొందిన 'గాడ్జిల్లా vs కాంగ్' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు. ఇది ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లలో దీన్ని ఎన్ని భాషల్లో విడుదల చేశారో.. అంతే స్థాయిలో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కృత్రిమ గాడ్జిల్లాను తయారు చేసిన ఓ సంస్థపై గాడ్జిల్లా దాడి చేస్తుంటుంది. అప్పుడు కాంగ్‌ను తీసుకొచ్చి దాన్ని అంతమొందించాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే ఈ రెండు భారీ జంతువుల మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. చివరికి ఈ రెండూ కలిసి కృత్రిమ గాడ్జిల్లాను ఎలా నిర్వీర్యం చేశాయి అన్నదే ఈ సినిమా కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X