అబ్బురపరిచే యాక్షన్‌తో గాడ్జిల్లా x కాంగ్: ట్రైలర్ చూశారంటే మైండ్ బ్లాకే!
హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వస్తుంటుంది. అందులోనూ గ్రాఫిక్స్‌తో రూపొందే సినిమాలకు మరింత ఆదరణ దక్కుతోంది. గతంలో ఈ తరహాలో వచ్చిన ఎన్నో చిత్రాలు విశేషమైన స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో 'కింగ్ కాంగ్', 'గాడ్జిల్లా' సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో వీటికి కొనసాగింపుగా కొన్ని భాగాలు కూడా వచ్చాయి. అయితే, ఈ సారి ఈ రెండింటినీ కలుపుతూ 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' మూవీకి కొనసాగింపుగా ఇప్పుడు రాబోతున్న మరో చిత్రమే 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్'. ఆడమ్ వింగార్డ్ దర్శకత్వంలో లెజెండరీ పిక్చర్స్ సంస్థ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను హై రేంజ్ గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక, ఈ మూవీని మార్చి 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' నుంచి రెండో ట్రైలర్‌ను వదిలారు.
'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' సినిమా గాడ్జిల్లా, కాంగ్ మధ్య యుద్దాన్ని చూపించారు. 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' మూవీలో ఈ రెండు జంతువులు కలిసి మరో శత్రువుపై పోరాటం చేయడాన్ని చూపించబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా వచ్చిన ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఇక, ఈ వీడియోలో యాక్షన్ సీక్వెన్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విజువలైజేషన్ కానీ అద్భుతంగా కుదిరింది. ముఖ్యంగా ఏప్స్‌తో కాంగ్, గాడ్జిల్లా పోరాడే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఫలితంగా ఈ ట్రైలర్ వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' మూవీలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ సహా పలువురు స్టార్లు నటించారు. దీన్ని థామస్ థుల్, టామ్ జాస్నీ సహా పలువురు నిర్మించారు. ఈ చిత్రానికి టామ్ హాల్క్‌బర్గ్, ఆంటోనియోలు సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











