Golden Globe Awards 2024: ఒక్క సినిమాకే 4 అవార్డులు.. RRR అందుకున్నది ఈ సారి ఎవరికి వచ్చిందంటే!
ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లకు ఇచ్చే అవార్డులు ఎన్నో ఉన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుని ప్రతిష్టాత్మక అవార్డులుగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఒకటి. ప్రపంచంలోని పలు ఇండస్ట్రీలకు వేరు వేరుగా ఇచ్చే ఈ అవార్డుల వేడుక తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది. వీటిలో పలు చిత్రాలు హవాను చూపించి ఎన్నో అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో విజేతల పూర్తి వివరాలను చూసేద్దాం పదండి!
వరల్డ్ సినిమాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డుల కార్యక్రమం అమెరికాలని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో హాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు అదిరిపోయే ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. వీళ్లతో పాటు కొందరు ఇండియన్ సెలెబ్రిటీలూ హాజరయ్యారు.

81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి సెన్సేషన్ అయిన 'ఓపెన్‌హైమర్' మూవీ సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు అందుకుంది. అందులో ఉత్తమ నటుడిగా (సిలియన్ మర్ఫీ), ఉత్తమ దర్శకుడిగా (క్రిస్టఫర్ నోలన్), ఉత్తమ సహాయ నటుడిగా (రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) కేటగిరిల్లో దీనికి అవార్డులు దక్కాయి.
'ఓపెన్‌హైమర్' తర్వాత 'ది బేర్' సినిమా కూడా హవాను చూపించింది. ఈ చిత్రం కూడా మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. అలాగే, ఎన్నో చిత్రాలు సత్తా చాటుకున్నాయి. ముఖ్యంగా గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీలోని 'నాటు నాటు' పాటకు పురస్కారం దక్కగా.. ఈ సారి బార్బీ (Barbie) మూవీలోని 'వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్' ఈ అవార్డును అందుకుంది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు విజేతలు
బెస్ట్ మోషన్ పిక్చర్ (డ్రామా) - ఓపెన్‌హైమర్
బెస్ట్ పిక్చర్ (మ్యూజిక్/ కామెడీ) - పూర్ థింగ్స్
బెస్ట్ యాక్టర్ (మోషన్ పిక్చర్) - సిలియన్ ముర్ఫీ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ యాక్టర్(ఓపెన్‌హైమర్) - పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)
బెస్ట్ యాక్ట్రెస్ (డ్రామా) - లిలీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్)
బెస్ట్ యాక్ట్రెస్ (మ్యూజికల్) - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ డైరెక్టర్ - క్రిస్టఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ స్క్రీన్ ప్లే - జస్టిన్ ట్రియెట్ & ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - డావిన్ జాయ్ రాండోల్ఫ్, (ది హోల్డోవర్స్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
బెస్ట్ టీవీ సిరీస్ (డ్రామా) - సక్సెషన్
బెస్ట్ టీవీ సిరీస్ (మ్యూజికల్) - ద బేర్
బెస్ట్ యాక్టర్ (టీవీ సిరీస్) - కీరన్ కల్కిన్ (సక్సెషన్)
బెస్ట్ యాక్ట్రెస్ (డ్రామా - టీవీ సిరీస్) - సారా స్నూక్ (సక్సెషన్)
బెస్ట్ ఆంథాలజీ సిరీస్ - భీఫ్
బెస్ట్ యానిమేషన్ మూవీ - ది బాయ్ అండ్ ది హెరాన్
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్


Click it and Unblock the Notifications











