twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?

    |

    సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 ఫిబ్రవరి 28న యుఎస్‌లో జరగనుంది. గత ఎడాఫీ జరగాల్సిన ఈ వేడుకను కరోనా మహమ్మారి. కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్ గా బిగెస్ట్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇక మార్చి 1న భారతదేశంలో తెల్లవారుజామున ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

    టీనా ఫే, అమీ పోహ్లెర్ హోస్ట్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇది 78 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్‌ఎఫ్‌పిఎ) మొదటిసారిగా నామినేషన్లను ప్రకటించింది. ఆరుసార్లు గోల్డెన్ గ్లోబ్ విజేత సారా జెస్సికా పార్కర్, గోల్డెన్ గ్లోబ్ విజేత తారాజీ పి.హెన్సన్ నామినేషన్లను ప్రకటించారు.

    Golden Globes 2021 awards live telecast more details

    ఇక టీనా ఫే అలాగే అమీ పోహ్లెర్ 2013, 2014, 2015 సంవత్సరాల్లో హోస్ట్ చేసిన తర్వాత నాల్గవసారి హోస్ట్ గా సందడి చేయబోతున్నారు. భారతదేశంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 మార్చి 1, 2021 న, ఉదయం 6:30 నుండి మొదలు కానుంది. కామెడీ సెంట్రల్ ఇండియా, విహెచ్ 1 ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. గోల్డెన్ గ్లోబ్స్ సోషల్ మీడియా పేజీలలో కూడా అప్డేట్స్ పొందవచ్చు .

    English summary
    Golden Globe Awards 2021 is all set to be held live on February 28 in the US that is, March 1, early in the morning in India. The event will be held at The Beverly Hilton, Beverly Hills, California and is being hosted by Tina Fey and Amy Poehler.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X