Golden Globe Awards 2025: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భారతీయ సినిమాకు నిరాశ..
Golden Globe Awards 2025: సినీ ప్రపంచ ప్రతిష్టాత్మకంగా భావించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ఈవెంట్ లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ హోటల్‌లో ఘనంగా ప్రారంభమైంది. కమెడియన్ నిక్కీ గ్లేజర్ ఈ ఈవెంట్ కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ అవార్డు కార్యక్రమానికి ఇండియా నుంచి సినీ నిర్మాత పాయల్ కపాడియా హాజరయ్యారు. ఈ ఏడాది అవార్డ్ కోసం ఇండియా నుంచి 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్'సినిమా బరిలో నిలిచింది. ఈ సినిమా బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో పోటీపడింది. కానీ, ఈ రెండు విభాగాల్లో ఈ సినిమాకు నిరాశే ఎదురైంది.
ఇండియాన్ సినిమాకు 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్' కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వస్తుందని సీని ప్రేమికులు భావించారు. కానీ, చివరికి నిరాశే మిగిలింది. అంతముందుకు ఈ సినిమాకు ఎన్నో అవార్డులు అందుకుంది. ఆసియా పసిఫిక్ స్క్రీన్ పురస్కారాల్లో ఐదు నామినేషన్లు దక్కించుకున్న ఈ సినిమా నిలిచింది. అలాగే.. కేన్స్ ఫిల్మ్ ఫెవివల్ లో గ్రాండ్ ప్రిక్స్‌ను కైవసం చేసుకుంది. ఇలా అరుదైన ఘనతను సాధించిన తొలి భారతీయ సినిమాగా 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్' నిలిచింది. ఇప్పటి వరకూ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఇండియాన్ సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో నామినేట్ అయ్యాయి.

అంతకుముందు 'గోల్డెన్ గ్లోబ్' అవార్డ్‌ను RRR దక్కించుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాటకుగాను 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు వరించింది. టాలీవుడ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలివ్యక్తిగా సంగీత దర్శకుడు M.M. కీరవాణి రికార్డ్ క్రియేట్ చేశారు. అలాగే.. 2009 లో సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ 'స్లమ్‌డాగ్ మిలీనియర్' సినిమాకు గాను 'బెస్ట్ ఒరిజినల్ స్కోర్' విభాగంలో ఈ అవార్డు అందుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











