Golden Globes Award 2022.. చరిత్ర సృష్టించిన విల్ స్మిత్.. స్టీవెన్ స్పీల్‌బర్గ్ మూవీకి అవార్డు..
ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా నిస్తేజంగా సాగింది. 79వ గోల్టెన్ గ్లోబ్ అవార్డులను జనవరి 10న భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు ప్రకటించారు. అయితే కోవిడ్ పరిస్థితులు, అలాగే కొన్ని మీడియా సంస్థల బాయ్‌కాట్ కారణంగా ఈ అవార్డుల కార్యక్రమం వేడుకలు ప్రత్యక్ష ప్రసారం కాకపోవడం ఓ వివాదంగా మారింది. ఈ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వివాదాల మధ్య గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక
గొల్గెన్ గ్లోబ్స్ అవార్డులంటే రెడ్ కార్పెట్, లైవ్ స్ట్రీమింగ్, టెలివిజన్‌లో లైవ్ టెలికాస్ట్‌తో అదిరిపోయేది. అయితే ఈ సారి రెడ్ కార్పెట్ లేకుండా కేవలం 90 నిమిషాల్లోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముగించారు. అయితే ఈ అవార్డుల్లో క్రెడిబిలిటి లోపించిందనే ఆరోపణలు రావడం కాస్త మసకబారింది. ఈ వేడుకలను యూఎస్ బ్రాడ్ కాస్టర్ ఎన్‌బీసీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, వార్నర్ మీడియా బహిష్కరించాయి. దాంతో గోల్డెన్ గ్లోబ్ వెబ్‌సైట్‌లో అవార్డుల వివరాలను పబ్లిష్ చేశారు.

విల్ స్మిత్‌కు తొలిసారి అవార్డు
గొల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో అమెరికన్ నటుడు, ర్యాపర్, నిర్మాత విల్ స్మిత్ సత్తా చాటాడు 2021లో విడుదలైన కింగ్ రిచర్డ్ సినిమాలో రిచర్డ్ విలియమ్ పాత్రను పోషించినందుకుగాను ఈ అవార్డును గెలుచుకొన్నారు. గతంలో ఆరుసార్లు నామినేట్ అయినా ఈ అవార్డు దక్కలేదు. తాజాగా తొలిసారి అవార్డును దక్కించుకోవడం విశేషంగా మారింది. టెన్నిస్ రంగంలో అగ్రతారలు వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన రిచర్డ్ విలియమ్స్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రిచర్డ్ విలియమ్స్‌గా విల్ స్మిత్ నటించి విమర్శల ప్రశంసలు అందుకొన్నారు.

అండ్రూ గారిఫీల్డ్‌కు అవార్డు
79వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో బ్రిటిష్, అమెరికన్ నటుడు అండ్రూ గారిఫీల్డ్ అవార్డును గెలుచుకొన్నారు. టిక్ టిక్.. బూమ్ అనే జీవిత కథ ఆధారంగా రూపొందిన లిన్ మన్యెయెల్ మిరాండా చిత్రంలో జొనాథన్ లార్సన్ పాత్రను పొషించినందుకుగాను ఈ అవార్డుల లభించింది. అండ్రూ గారిఫీల్డ్ గతంలో మూడుసార్లు నామినేట్ అయ్యాడు. కానీ తొలిసారి ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.

స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రానికి
అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా వెస్ట్ సైడ్ స్టోరి చిత్రం బెస్ట్ పిక్చర్ - మ్యూజికల్ డ్రామా/కామెడీ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకొన్నది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించగా, టోని కుష్నెర్ స్క్రీన్ ప్లే అందించారు. వెస్ట్ సైడ్ స్టోరి చిత్రంలో నటించిన రాచెల్ జగ్లర్‌కు కూడా మోషన్ పిక్చర్ కేటగిరిలో ఉత్తమ నటి అవార్డును గెలుచుకొన్నారు.

ఉత్తమ అవార్డుల జాబితా.. విజేతలు వీరే
బెస్ట్ మోషన్ పిక్చర్ (డ్రామా) - ది పవర్ ఆఫ్ ది డాగ్
బెస్ట్ టెలివిజన్ సిరీస్ (డ్రామా) - సెక్సెషన్
బెస్ట్ డైరెక్టర్ (మోషన్ పిక్చర్) - జేనే్ కాంపియన్ - ది పవర్ ఆఫ్ ది డాగ్
బెస్ట్ హీరోయిన్ మోషన్ పిక్చర్ (డ్రామా) నికోల్ కిడ్‌మన్ - బీయింగ్ రికార్డోస్
బెస్ట్ పిక్చర్ (మ్యూజికల్ లేదా కామెడీ) - వెస్ట్ సైడ్ స్టోరి
బెస్ట్ హీరోయిన్ మోషన్ పిక్చర్ (మ్యూజికల్ లేదా కామెడీ) - రాచెల్ జెగ్లర్ - వెస్ట్ సైడ్ స్టోరి
బెస్ట్ యాక్టర్ మోషన్ పిక్చర్ (డ్రామా) - విల్ స్మిత్ - కింగ్ రిచర్డ్
బెస్ట్ యాక్టర్ మోషన్ పిక్చర్ (మ్యూజికల్ లేదా కామెడీ) - అండ్రూ గ్యారీఫీల్డ్ టిక్ టిక్ బూమ్
బెస్ట్ మ్యూజిక్ (మోషన్ పిక్చర్) - డ్యూన్ - హన్స్ జిమ్మర్
బెస్ట్ సాంగ్ - నో టైమ్ టూ డై - నో టైమ్ టూ డై
బెస్ట్ హీరోయిన్ లిమిటెడ్ సిరీస్, ఆంథోలాజి - కేట్ విన్స్‌లెట్ - మారే ఆఫ్ ఈస్ట్ టౌన్


Click it and Unblock the Notifications











