మొదటి జీతం అలా ఖర్చుపెట్టాను..?
మొదటి జీతం తీసుకునే సందర్బం జీవితంలో మరచిపోలేని అనుభూతిని అందిస్తుంది. ఆ మొదటి జీతాన్ని చాలా మంది భద్రంగా దాచుకుంటారు. మరికొంత మంది వాటిని అనాధాశ్రమాలకు, పార్టీలకు, ఉత్తమమైన కార్యక్రమాలకు ఖర్చుపెడుతుంటారు. ఐతే హాలీవుడ్ పాపులర్ సంగర్ జస్టిన్ బైబర్ గర్ల్ ప్రెండ్ సెలీనా గోమెజ్ మాత్రం తన మొదటి జీతాన్ని తన తల్లిదండ్రులకు ఇచ్చి వాటిని రూమ్ అద్దెల కోసం ఉపయోగించమని అన్నారు.
సెలీనా గోమెజ్ ఇలా తన మొదటి జీతాన్ని చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. తన తల్లిదండ్రులు సెలీనా గోమెజ్ కెరియర్ కోసం టెక్సాస్‌లో ఉన్న సొంత ఇల్లుని వదిలి పెట్టి లాస్ ఏంజిల్స్‌కి రావడం జరిగింది. ఈ సందర్బంలో సెలీనా గోమెజ్ మాట్లాడుతూ నా మొదటి జీతాన్ని మా తల్లిదండ్రులకు అందజేయడమే కాకుండా, వాటిని అద్దె కోసం ఉపయోగించాల్సిందిగా కోరానని అన్నారు. నేను అనుకున్నట్లే మా తల్లి దండ్రులు కూడా నా మొదటి చెక్ జీతాన్ని అందుకే ఖర్చుపెడతారని విశ్వసిస్తున్నానని అన్నారు.
సెలీనా గోమెజ్ విడుదల చేసిన మూడవ ఆల్బమ్ “వెన్ ద సన్ గోస్ డౌన్" ఈ సంవత్సరం మద్యలో విడుదల చేసి మాంచి సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఇదే విధంగా సెలీనా గోమెజ్ తాను నటించిన 'మోంటీ కార్లో' సినిమాపై సక్సెస్‌ని ఆశిస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











