సింగింగ్ కంటే యాక్టింగ్ పైనే మక్కువ ఎక్కువ
సింగర్, హీరోయిన సెలీనా గోమెజ్ ప్రస్తుతం తాను కొనసాగిస్తున్న మ్యూజిక్ కెరియర్‌ని ప్రక్కకు పెట్టి యాక్టింగ్‌పై దృష్టిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. సెలీనా గోమెజ్ విడుదల చేసిన మూడవ ఆల్బమ్ “వెన్ ద సన్ గోస్ డౌన్" ఈ సంవత్సరం మద్యలో విడుదల చేసి మాంచి సక్సెస్‌ని సాధించిన విషయం తెలిసిందే. ఇదే విధంగా సెలీనా గోమెజ్ తాను నటించిన 'మోంటీ కార్లో' సినిమాపై సక్సెస్‌ని ఆశిస్తుంది.
ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో సెలీనా గోమెజ్ మాట్లాడుతూ నా ఆల్బమ్‌ని మార్కెట్లో పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నానని అన్నారు. వచ్చే సంవత్సరం మ్యూజిక్ కెరియర్‌కి ప్రక్కన పెట్టి ఎక్కువ సినిమాలలో నటించాలనేది ధ్యేయంగా పెట్టుకున్నానని అన్నారు. వచ్చే సంవత్సరం రెండు సినిమాలకు ఒప్పుకోగా, వీటితో పాటు మ్యూజిక్‌లో కూడా అభిమానుల కోసం మంచి ఆల్బమ్స్‌ని విడుదల చేస్తానని తెలిపారు.
సెలీనా గోమెజ్ టైటానిక్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియోతో కలసి నటించాలని ఇటీవలే తన మనసులోని కొరికను బయట పెట్టింది. ఈ సందర్బంలో సెలీనా గోమెజ్ మాట్లాడుతూ నాకు తెలిసి నన్ను లియోనార్డో డికాప్రియో పిలిచి తనతో వర్క్ చేయమని మాత్రం అడగకపోవచ్చు. కానీ నేను మాత్రం నా జీవితంలో ఒక్కసారైనా లియోనార్డో డికాప్రియోతో కలసి పని చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఏ సమయంలోనైనా నాఅంతట నేను ఆయనని నాతో కలసి వర్క్ చేయమని అడగాలని అనుకుంటున్నానని అన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే సాల్మా హాయక్, నటాలీ పోర్ట్ మెన్‌లు వర్క్ మీద చూపే ఆసక్తి నాకు బాగా నచ్చుతుందని అన్నారు. ఇటీవలే నాకు సాల్మా హాయక్ నుండి ఓ ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్‌లో సాల్మా హాయక్ నన్ను తనతో కలసి వర్క్ చేయమని అడగడం జరిగిందన్నారు.


Click it and Unblock the Notifications











