మంచి ప్రియుడికి 'క్షమాపణ' అనే పదం తెలిసుండాలి..!
హాలీవుడ్ పాప్ గాయకుడు జస్టిన్ బైబర్ మీరు గనుక ఓ మంచి స్నేహితుడుగా ఉండాలంటే కొన్ని సందర్బాలలో మీరు చేసిన తప్పులను ఒప్పుకోవాల్సి వస్తుందని అన్నాడు. 18 సంవత్సరాల వయసు కలిగిన జస్టిన్ బైబర్, 19 సంవత్సరాల వయసు కలిగిన సెలీనా గోమెజ్‌తో 2010 నుండి డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మద్య ఇప్పటి వరకూ మంచి వాతావరణం ఉండడానికి గల కారణాలను తెలియజేస్తూ ఎప్పుడైనా నేను తప్పు చేస్తే వెంటనే సెలీనాని క్షమాపణ కొరతానని తెలిపాడు.
ఇంకా చెప్పాలంటే ఒక మంచి ప్రియడుగా ఉండాలంటే, మీలో సహనానికి ఉండాలి... ఇక అమ్మాయిలు విషయానికి వస్తే మీరు ఎల్లప్పుడూ తప్పులు చేస్తున్నట్లైతే... క్షమించండనే ఒక్క మాట మీ ఇద్దరి మద్య మంచి సద్బావన వాతావరణాన్ని కలగజేస్తుందని ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. ఐతే ఇటీవల వీరిద్దరి సంబంధం గురించి సెలీనా గోమెజ్‌ని ప్రశ్నించగా గోమెజ్ తనదైన శైలిలో బదులిచ్చారు. టీనేజీలో ఉన్న ఇద్దరి ప్రేమికుల మద్య ఎటువంటి సంబంధమైతే ఉంటుందో అటువంటి సంబంధమే తన బాయ్ ప్రెండ్ జస్టిన్ బైబర్‌తో తనకుందని అన్నారు. అంతే తప్ప మీరంతా అనుకున్నట్లు మా ఇద్దరి మద్య మరేదో సంబంధం లేదని స్ఫష్టం చేశారు.


Click it and Unblock the Notifications











