అట్టహాసంగా జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమం
బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత పాప్ గాయని అడెల్ ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఉద్వేగానికి కారణం ఆమె గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ఆరు గ్రామీ అవార్డులను పొందడమే. 23 సంవత్సరాల వయసు కలిగిన అడెల్ రూపొందించిన పాటల ఆల్బమ్ '21'కి ఈ యేడాది ఉత్తమ ఆల్బమ్ అవార్డుని పొందింది. దీనితో పాటు అడెల్ పాడిన పాట 'రోలింగ్ ఇన్ ద డీప్'కు ఈ సంవత్సరం ఉత్తమ పాట అవార్డుతో పాటు రికార్డు దక్కింది. ఇలా అడెల్‌కు మూడు కేటగిరిలలో గ్రామీ పురస్కారాలు లభించాయి.
2010లో జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో పాప్ గాయని బియోన్స్ ఆరు గ్రామీలను అందుకున్న జాబితాలో ఉన్నారు. ఈ గ్రామీ అవార్డులను ఆదివారం లాస్ ఏంజిల్స్ లో విజేతలకు అందజేశారు. వీటితో పాటు అమెరికన్ రాక్ స్టార్ డేవ్ గ్రోల్‌కు ఐదు అవార్డులతో పాటు.. ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఆపిల్ కంపెనీ సహా వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ కు మరణాంతరం ప్రకటించిన గ్రామీ అవార్డుని ఆ సంస్ద ప్రతినిధి అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో 48 సంవత్సరాల వయసులో మృతి చెందిన అమెరికా నటి వైట్నీ హాస్టన్ నివాళిగా ఆమె పాటలు పాడారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. వీరితో పాటు హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, హీరోలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











